1. వార్తలు
  2. బిజినెస్
  3. కథనాలు
  4. Krizak for student mobility through partnership with ForeignAdmits

ఫారిన్‌అడ్మిట్స్‌తో భాగస్వామ్యం ద్వారా విద్యార్థి చలనశీలత కోసం క్రిజాక్

ForeignAdmits Krijak logo
ForeignAdmits Krijak logo
విశాఖపట్నం: భారతదేశంలోని ప్రముఖ టెక్నాలజీ ఆధారిత అంతర్జాతీయ విద్యార్థి మొబిలిటీ ప్లాట్‌ఫామ్‌లలో ఒకటైన క్రిజాక్ లిమిటెడ్, ఈ రోజు ఎడ్యుమెంట్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్‌లో వ్యూహాత్మక పెట్టుబడిని పెట్టినట్లు వెల్లడించింది. ఫారిన్‌అడ్మిట్స్ ఆపరేటర్‌గా ఎడ్యుమెంట్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ చిపరిచితం.

ఫారిన్‌అడ్మిట్స్ అనేది ఒక ఏఐ-ఫస్ట్ స్టూడెంట్ మొబిలిటీ ప్లాట్‌ఫామ్, ఇది లక్ష మందికి పైగా విద్యార్థులకు సేవలు అందించటంతో పాటుగా రూ. 1,500 కోట్లకు పైగా విద్యా రుణాలను అందించింది. కంపల్సరీ కన్వర్టబల్ డిబెంచర్లు (సిసిడిలు) మరియు కంపల్సరీ కన్వర్టబల్ ప్రిఫరెన్స్ షేర్ల (సిసిపిఎస్) ద్వారా రూపొందించబడిన ఈ పెట్టుబడి, సాంకేతికత-ఆధారిత, ఫుల్ స్టాక్ స్టూడెంట్ మొబిలిటీ ప్లాట్‌ఫారమ్‌గా క్రిజాక్ మారుతున్న పరిణామంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. ఇది విద్యార్థుల ప్రయాణంలోని ప్రతి దశలోనూ వారికి సేవలందించే ఏఐ-ఆధారిత ఫైనాన్సింగ్ మరియు వీసా పరిష్కారాల రంగంలోకి  తన పరిధిని విస్తరిస్తుంది.
 
ఈ పెట్టుబడితో, విదేశీ విద్యా ప్రయాణంలోని అత్యంత కీలకమైన దశలైన గమ్యాన్ని ఎంచుకోవడం, ఆర్థిక సహాయం పొందడం మరియు వీసా క్లియర్ చేయడం వంటి వాటిలో విద్యార్థులకు మరియు కౌన్సెలింగ్ భాగస్వాములకు మద్దతు ఇచ్చే తన సామర్థ్యాన్ని క్రిజాక్ మరింత బలోపేతం చేసుకుంటుంది. ఈ దశలన్నీ వేగం, కచ్చితత్వం మరియు విస్తృత స్థాయిని అందించే ఏఐ-సామర్థ్యం గల సాంకేతికతతో పనిచేస్తాయి. ఫారిన్ అడ్మిట్స్ తన ప్రస్తుత బ్రాండ్ మరియు యాజమాన్యం కింద ఒక స్వతంత్ర సంస్థగా పనిచేయడం కొనసాగిస్తుంది, తద్వారా దాని వృద్ధికి ఆధారమైన సంస్థాగత చురుకుదనాన్ని, విద్యార్థి-కేంద్రీకృత సంస్కృతిని కాపాడుకుంటుంది.
 
మొబిలిటీ ప్లాట్‌ఫామ్ నుండి ఫుల్-స్టాక్, ఏఐ-సామర్థ్యం గల విద్యార్థి మౌలిక సదుపాయాల వరకు అంతర్జాతీయ స్టూడెంట్ మొబిలిటీలో అగ్రగామిగా నిలవడానికి, సాంకేతికత మరియు భాగస్వామ్యాలలో క్రిజాక్ నిరంతరం పెట్టుబడులు పెడుతూ వస్తోంది. ఇది యూకే, కెనడా, ఐర్లాండ్, ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్‌లోని 400కు పైగా సంస్థలతో తన కౌన్సెలింగ్ భాగస్వాముల గ్లోబల్ నెట్‌వర్క్‌ను అనుసంధానిస్తోంది. ఆ ప్రయాణంలో ఫారిన్‌అడ్మిట్స్ పెట్టిన ఈ  పెట్టుబడి తదుపరి ప్రధాన ముందడుగు. దీనిద్వారా ఫైనాన్సింగ్ మరియు వీసా ప్రిపరేషన్లో ఏఐ-ఆధారిత, నేరుగా విద్యార్థులకు చేరే సామర్థ్యాలను ఈ ప్లాట్‌ఫామ్‌లోకి తీసుకురావడం, మరియు కౌన్సెలింగ్ భాగస్వాములకు మునుపెన్నడూ లేని విధంగా విద్యార్థులకు మరింత సంపూర్ణంగా సేవ చేయడానికి అవసరమైన సాధనాలను అందించడం సాధ్యమవుతుంది. 
 
ఫారిన్‌అడ్మిట్స్  ఈ విలీన సంస్థకు ఒక యాజమాన్య, అవార్డు గెలుచుకున్న టెక్నాలజీ స్టాక్‌ను అందిస్తోంది:
లోన్ మాంక్ : భారతదేశపు మొట్టమొదటి ప్రీ-అడ్మిషన్ లోన్ అర్హత ఇంజిన్. దాదాపు 17కు పైగా రుణ భాగస్వాముల ద్వారా 80,000కు పైగా అసెస్‌మెంట్‌లు పూర్తి చేసి, విద్యార్థులు దరఖాస్తు చేయకముందే వారికి ఆర్థిక స్పష్టతను అందిస్తుంది.
వీసామాంక్: ప్రపంచవ్యాప్తంగా 3,000కు పైగా విద్యార్థులు విశ్వసించిన, ఏఐ-ఆధారిత వీసా ఇంటర్వ్యూ సిమ్యులేషన్ సాధనం. ఇది స్టూడెంట్ రిక్రూట్‌మెంట్‌లో 'డిజిటల్ ఇన్నోవేషన్ ఆఫ్ ది ఇయర్' విభాగంలో ది PIEoneer అవార్డ్స్ 2025 విజేత.
“మార్కెట్ లీడర్‌గా, విద్యార్థులు మరియు కౌన్సెలింగ్ భాగస్వాముల అవసరాలకు అనుగుణంగా ముందుండటమే మా బాధ్యత. ఫైనాన్సింగ్ మరియు వీసా సేవలకు సంబంధించి ఒక ఉన్నత స్థాయి ఏఐ-సామర్థ్యాన్ని ఫారిన్‌అడ్మిట్స్ అందిస్తోంది. మా సంస్థాగత బలానికి ఇవి తోడవ్వడం ద్వారా ఒక సమగ్రమైన వేదిక రూపుదిద్దుకుంది. ఈ రంగం అందించే సేవలలో ఇది ఒక కొత్త ప్రమాణాన్ని నెలకొల్పుతుంది..”
-  డా. వికాష్ అగర్వాల్, చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్, క్రిజాక్ లిమిటెడ్
చీఫ్ ప్రొడక్ట్ & మార్కెటింగ్ ఆఫీసర్‌గా క్రిజాక్‌లో నిఖిల్ జైన్ చేరనున్నారు
ఈ మార్పులో భాగంగా, ఫారిన్ అడ్మిట్స్ వ్యవస్థాపకుడు మరియు సీఈఓ అయిన నిఖిల్ జైన్, క్రిజాక్ సీనియర్ నాయకత్వంలో చీఫ్ ప్రొడక్ట్ & మార్కెటింగ్ ఆఫీసర్‌గా చేరనున్నారు. ఐఐటి (బిహెచ్‌యు) వారణాసి గ్రాడ్యుయేట్, స్టాన్‌ఫోర్డ్ సీడ్ స్పార్క్ పూర్వ విద్యార్థి, మరియు ఐఐటి బొంబాయి–మోనాష్ రీసెర్చ్ అకాడమీలో మాజీ డాక్టోరల్ పరిశోధకుడైన జైన్, పరిశోధనలో నిశిత పరిశీలన మరియు భారీ స్థాయిలో ఉత్పత్తిని అమలుచేయడం అనే అరుదైన కలయికను తనతో తీసుకువస్తారు. ఆయన ఈ విలీనమైన ప్లాట్‌ఫామ్‌లో ఉత్పత్తి వ్యూహం మరియు వినియోగదారు బ్రాండ్‌కు నాయకత్వం వహిస్తారు.
"ప్రతిభావంతులైన విద్యార్థులు పొందాల్సిన విద్యను పొందకుండా అడ్డుకుంటున్న అవరోధాలను తొలగించడానికి మేము ఫారిన్ అడ్మిట్స్‌ను తీర్చిదిద్దాము. క్రిజాక్‌లో చేరడం అంటే, అవసరమైన ప్రతి విద్యార్థిని చేరుకోవడానికి ఆ మిషన్ కు ఇప్పుడు సంస్థాగత పరిధి, ప్రపంచవ్యాప్త పంపిణీ , కౌన్సెలింగ్ భాగస్వాముల నెట్‌వర్క్ లభించాయని అర్థం. ఇది నిష్క్రమణ కాదు; ఇది మరింత వేగవంతం చేయటం"
 
-  నిఖిల్ జైన్, వ్యవస్థాపకుడు, ఫారిన్అడ్మిట్స్
అంతర్జాతీయ విద్యార్థుల మొబిలిటీ రంగంలో అగ్రగామిగా నిలవాలనే క్రిజాక్ యొక్క నిరంతర నిబద్ధతను ఈ పెట్టుబడి ప్రతిబింబిస్తుంది. 400కు పైగా సంస్థాగత భాగస్వామ్యాలు, గ్లోబల్ కౌన్సెలర్ నెట్‌వర్క్ మరియు ఫారిన్అడ్మిట్స్ యొక్క ఏఐ -ఆధారిత టెక్నాలజీని ఇప్పుడు అనుసంధానించడంతో, మొదటి శోధన నుండి తరగతి మొదటి రోజు వరకు కౌన్సెలింగ్ భాగస్వాములకు మరియు విద్యార్థులకు నిజమైన సంపూర్ణ అనుభవాన్ని అందించడానికి క్రిజాక్ సిద్ధంగా ఉంది.
About Writer
దేవీ