1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Congress high command directs minister Konda Surekha to resign

మంత్రి పదవికి రాజీనామా చేయండి : కొండా సురేఖకు హైకమాండ్ ఆదేశం

konda surekha
కాంగ్రెస్ మహిళా నేత కొండా సురేఖను తెలంగాణ మంత్రి మండలి నుంచి తొలగించడం ఖాయమని తెలిపోయింది. మంత్రి పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ అధిష్టానం ఆమెను ఆదేశించింది. దీంతో గత కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠతకు తెరపడింది. ప్రస్తుతం కొండా సురేఖ రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖామంత్రిగా విధులు నిర్వహిస్తున్నారు. 
 
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆమె కుమార్తె సుస్మిత పటేల్ చేసిన తీవ్ర విమర్శల నేపథ్యంలో క్రమ శిక్షణ చర్యల్లో భాగంగా మంత్రి పదవికి రాజీనామా చేయాలని సురేఖను హైకమాండ్ ఆదేశించింది. ఈ పరిణామంతో ఆమె మంత్రివర్గం నుంచి వైదొలగడం ఖాయమని తేలిపోయింది. 
 
కాగా, గత కొంతకాలంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత పటేల్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న విషయం తెల్సిందే. ఈ వ్యవహారంపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ విచారణ జరిపి, అధిష్టానానికి ఒక నివేదికను సమర్పించాయి. ఈ నివేదికను రాష్ట్ర పార్టీ నేతల అభిప్రాయాలను తీవ్రంగా పరిగణించిన కాంగ్రెస్ పెద్దలు కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించాలని  నిర్ణయించారు. 
 
ఇందులోభాగంగా, మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆమెను హైకమాండ్ ఆదేశించింది. దీంతో ఆమె రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఒకవేళ ఆమె స్వయంగా తప్పుకోని పక్షంలో తక్షణమే బర్తరఫ్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూచించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కొండా సురేఖ బర్త‌రఫ్‌కు సంబంధించిన సిఫార్సు లేఖ కూడా గవర్నర్‌కు చేరినట్టు ఊహాగానాలు వస్తున్నాయి. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
భారతదేశంలో బిల్ పేమెంట్స్ సేవను ప్రారంభిస్తున్న వాట్సాప్