ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో రూ. 36 కోట్ల పెట్టుబడితో పరిశ్రమ ఏర్పాటుకి మంచు మనోజ్ ఒప్పందం
సినీ నటుడు మంచు మనోజ్, ఆయన అర్థాంగి భూమా మౌనిక ఏపీ ప్రభుత్వంతో రూ. 36 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. విశాఖలో జరుగుతున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు 2026లో ఈ కీలక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. మౌనిక-మనోజ్ స్థాపించిన నమస్తే వరల్డ్ కంపెనీ కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లులోని పారిశ్రామిక పార్కులో హస్తకళా ఉత్పత్తుల తయారీ పరిశ్రమను నెలకొల్పనున్నారు. ఇక్కడ పిల్లల ఆటబొమ్మలు, హస్తకళా ఉత్పత్తులు తయారుచేస్తారు.
ఈ సందర్భంగా భూమా మౌనిక మాట్లాడుతూ... సీఐఐ సదస్సు ద్వారా ఎందరో హస్తకళాకారులు, యువపారిశ్రామికవేత్తలు రావడం సంతోషమని అన్నారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసారు.
Heartiest congratulations to Manoj and Munni! What a fantastic milestone and a proud moment. Wishing you both continued success, bigger achievements and many more milestones ahead! @HeroManoj1 @BhumaMounika #NamastheToys https://t.co/KbFFrbELah
— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) November 13, 2026

