Bhogi review : శర్వానంద్ పెట్టిన భోగి మంటలు ఏమయ్యాయి.. భోగి రివ్యూ
Sharwanands Bhogi
కథ:
ఆదిలాబాద్ లోని ఓ మారుమూల గ్రామం బొగ్గులకుంట. అది 1962వ సంవత్సరం. నవాబుల పాలన. ఆ గ్రామానికి పెద్ద దిక్కు పటేల్. అప్పట్లో పటేల్ కు ఎదరుగా నిలవడడం కానీ, మొహం చూడడం కానీ సాహసించి గ్రామ ప్రజలు చేయరు. అది అప్పటి రూల్. అలా ప్రజల్ని భయపెట్టి తన స్వార్థం కోసం అక్కడి యువతకు సెంటిమెంట్ రంగరించి పక్క ఊళ్ళ నుంచి యువతులను ఎత్తుకొచ్చి ఊరి దేవతకు బలిఇస్తుంటాడు. అతనికి నమ్మిన స్వామీజీ, మునసబులాంటి ఓ వ్యక్తి. అదే ఊరిలో ఐదుగురు చెల్లెల్లకు గంగా (శర్వానంద్) అన్న. పక్కింటిలో వుండే సులోచన (అనుపమ) ప్రేమించుకుంటారు. ఈ క్రమంలో తన పెద్దచెల్లెలికి నిశ్చితార్థం చేసుకునే టైంలో తన ఐదుగురు చెల్లెల్లు మాయమవుతారు. ఆ వెతుకులాటలో బొగ్గులకుంటను బొందలగడ్డగా పటేల్ మార్చేస్తున్నాడని తెలుసుకున్న గంగా ఏ చేశాడు? అనేది మిగిలిన కథ.
సమీక్ష:
తెలంగాణాలో పటేల్ వ్యవస్థ నవాబుల కాలం నుంచి వుంది. కాలక్రమేణా అది అంతరించింది. అప్పట్లో పటేల్‌లు ఇలా వుండేవారు, అలా వుండేవారంటూ రకరకాల కథలు వచ్చాయి. రంగస్థలంలో అలాంటిది ఈతరం రుచి చూశారు. ఇక భోగిలో అంతకుమించి వుంటుంది. తన మాటకు ఎదురొడ్డితే వాడిపని అంతే. ఇలా అప్పట్లో ఇలా వుండేదని, ఇది జరిగిన వాస్తవం అంటూ దర్శకుడు సంపత్ నంది చెబుతూ వచ్చారు. కథానాయకుడు శర్వా కూడా ఇంతకుముందు చేయని రగ్గెడ్ పాత్ర చేశాడు.
శర్వానంద్ పాత్ర వరకు బాగానే చేశాడు. కథ ప్రకారం ఆయన కష్టం కనిపించింది. అనుపమ పరమేశ్వర్ కూడా తన పాత్ర మేరకు నటించింది. డింపుల్ హయాతి ఓ వేశ్యగా నటించి గ్రామ ప్రజలకు ఏదో చేయాలనే తపనతో కూడిన పాత్ర ఆమెది. పటేల్ ఏది చెబితే అది చేసే ప్రజలు ఆఖరికి తాను చేసిన నరబలులు కూడా సమంజసమే అనేలా ప్రజలను ఒప్పించడం హైలైట్. అంటే అప్పట్లో ప్రజలు ఏది తప్పో ఏది రైటో తెలుసుకోలేకపోవడం, తెలిసినా ఎదురుతిరగకపోవడం అనేది ఆనవాయితీ. అలాంటిది గంగా అనే ఓ పాత్ర ఎలా ఎదురు తిరిగింది. తన చెల్లెల్ని తన ముందే నరబలి ఇస్తే తాను ఏం చేయగలిగాడు అన్నది ఇందులో చూడొచ్చు.
ఈ కథకు దేశంలో జరిగిన పలు నరబలుల కథలను ఉటంకిస్తూ సినిమా చివరిలో పేపర్ కటింగ్ చూపించడం విశేషం. మొదటి భాగం బాగానే అనిపిస్తుంది. ఇంటర్వెల్లో తన చెల్లెని కోల్పోవడంతో గంగ పాత్ర వయొలెంట్‌గా మారుతుంది. ఆల్మోస్ట్ చనిపోయాడనుకున్న గంగ పాత్ర తిరిగి బతకడం పటేల్, పోలీస్ పైన పగ తీర్చుకోవడం సినిమా.
ఈమధ్య సినిమాల్లో హింస మితిమీరిపోతుందంటూ కొన్ని రీ సెన్సార్ కు వెళుతున్నాయి. అలాగే ఈ సినిమా వెళ్ళింది. కానీ తాము కథ ప్రకారం చూపించిన హింసలో ఎటువంటి కత్తిరింపులు లేవని దర్శకుడు విడుదలకు ముందే చెప్పాడు. ఏది ఏమైనా మితిమీరిన హింస, రక్తపాతం అనేవి అందరికీ సెట్ కాదు. శర్వాకు అదే జరిగింది.
మనమే నారీ నారీ నడుమ మురారి, బైకర్ వంటి సినిమాలు చేసి సంక్రాంతికి మరలా వస్తానని గతంలో స్టేట్ మెంట్ ఇచ్చిన శర్వా ఈసారి నవంబర్ కే రావడం విశేషం. ఇక ఇందులో మిగిలిన పాత్రలలో తమిళ, కన్నడ నటీనటులు కనిపిస్తారు. ఇక, లవ్ సాంగ్ లు కానీ, ఐటెంసాంగ్ లు కానీ వుండవు.
టెక్నికల్ గా చూస్తే, సంగీతం కొంతమేర హోరు ఎత్తించినా పర్వాలేదు అనిపిస్తుంది. సంభాషణల పరంగా ప్రాసలు పొందికగా వాడుకున్నారు. సినిమాటోగ్రపీ బాగానే వుంది. బొగ్గుల కుంట కోసం ఏకంగా ఊరి సెట్‌ను హైదరాబాద్ శివార్లో వేశారు. దాదాపు 40 కోట్ల వరకు ఖర్చయిందని నిర్మాతలు చెబుతున్నా రిలీజ్ కు మూడోభాగం కూడా రాలేదని తెలుస్తోంది. ఇలాంటి సినిమా ఎందుకు తీశాడనేకంటే ఎందుకు చూడాలని ప్రేక్షకులు అనుకుంటే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమా వల్ల సభ్యసమాజానికి దర్శకుడు ఏం చెప్పదలిచాడో అర్థం కాదు. కాకపోతే చివరిలో ప్రదర్శించిన పేపర్ కటింగ్ ను బట్టి నమ్మకం, మూఢ నమ్మకం మధ్య జరిగిన కథగా అనిపిస్తుంది. అందుకే భోగి మాడిమసయింది.
రేటింగ్ : 1.5/5

