1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
  4. People with diabetes should not do that under any circumstances

మధుమేహం వున్నవారు ఆ పని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయరాదు

Diabetes
మధుమేహం ఉన్నవాళ్లలో ఒంట్లో నీరు తగ్గిపోతే తీవ్రమైన అనారోగ్య సమస్య వస్తుంది. కనుక వీరు సాధ్యమైనంత ఎక్కువుగా నీరు తాగుతూ ఉండాలి. ఈ వ్యాధితో వున్నవారు పాటించాల్సిన నియమాలు ఏమిటో తెలుసుకుందాము. డయాబెటిస్ వున్నవారు పాలు, పెరుగు తీసుకోవచ్చు గానీ కొవ్వు ఎక్కువుగా ఉండే బటర్, చీజ్, నెయ్యిలకు దూరంగా వుండాలి.
 
రోజుకి కనీసం మూడు సార్లయినా తాజా కూరగాయలు తీసుకోవాలి. క్యాబేజీ, పుదీనా, పాలకూర, కాకరకాయ, బెండకాయ, కాలీఫ్లవర్, దోసకాయ, క్యారెట్, ముల్లంగి, ఉల్లికాడలు, గుమ్మడికాయలు మేలు చేస్తాయి. చాలా తీయగా ఉండే మామిడి, అరటి వంటివి చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి.
 
తీపి పండ్లను భోజనం చేసిన వెంటనే తింటే రక్తంలో గ్లూకోజ్ త్వరగా పెరుగుతుంది. మధుమేహం ఉన్న వాళ్లు ఎట్టి పరిస్థితులలోను ఆహారం తినటాన్ని మానేయటం మంచిదికాదు. ప్రతిరోజు ఒకే సమయంలో భోజనం చేయటం వల్ల రక్తంలో చక్కెర స్థిరంగా ఉండేందుకు దోహదం చేస్తుంది.
కేకులు, మిఠాయిలు, చాక్లెట్లు వంటి అధిక చక్కెర గల పదార్ధాలు, తీయటి పానీయాల జోలికి వెళ్లకూడదు.
 
ఎక్కువ నూనెతో వేయించే పదార్ధాలకన్నా ఉడికించినవి తినటం ఎంతో మంచిది. రోజులో ఎప్పుడైనా సరే ఆహారాన్ని ఒకేసారి పెద్దమెుత్తంలో తినకుండా జాగ్రత్తపడాలి. గమనిక: ఈ చిట్కాలు వైద్య సమాచారం అవగాహన మేరకు ఇవ్వబడింది. వైద్య నిపుణుడిని సంప్రదించి ఆచరించాలి.
About Writer
సిహెచ్
తర్వాతి కథనం
ప్రపంచ ఆహార దినోత్సవం: మీ నడుము చుట్టుకొలత పెరిగే కొద్దీ మీ ప్లేట్ స్థితి కూడా మారిపోతుంది