1. ఇతరాలు
  2. »
  3. ఆరోగ్యం
  4. »
  5. వ్యాధి

అనారోగ్యామే మధుమేహ వ్యాధి

శరీరం చక్కెర గ్లూకోజ్ అవసర. యంత్రం శక్తి అవసరం
శరీరానికి చక్కెర (గ్లూకోజ్‌) ఎంతో అవసరం. యంత్రం పనిచేయాలంటే శక్తి అవసరం. అలాగే శరీరానికి కూడా. అందుకు కావలసిన శక్తిని ఇచ్చేది చక్కెర మాత్రమే. అందువల్ల మానవ దేహంలో గ్లూకోజ్‌ ఎలా తయారవుతుంది, ఎలా నిల్వ ఉంటుంది, ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాలను తెలుసుకోవడం అందరికీ అవసరం. ఈ మూడింటిలో ఏ ఒక్కటి దారి తప్పినా అనారోగ్యం ఏర్పడుతుంది. ఈ అనారోగ్యాన్నే మధుమేహ వ్యాధి (డయాబెటిస్‌) అంటారు.

దీనికే మరోపేరు చక్కెర వ్యాధి. శరీరంలో చక్కెర హెచ్చుతగ్గుల వల్ల కలిగే అనారోగ్యాన్ని వ్యాధి అని అంటున్నా, నిజానికి ఇది వ్యాధి కాదు. కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ డయాబెటిస్‌ను అదుపులో ఉంచగలిగితే మనిషి ఎంతకాలమైనా హాయిగా జీవించగలడు.

మనం ఆహారం ఎక్కువగా తీసుకున్నప్పుడు శరీరంలో చక్కెర ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇలా అదనంగా ఉత్పత్తి అయిన చక్కెర కాలేయం (లివర్‌)లో నిల్వ ఉంటుంది. మనం శారీరకంగా ఎక్కువ కష్టపడితే, కణాలకు ఎక్కువ శక్తి అవసరమవుతుంది. అంటే ఎక్కువ చక్కెర (గ్లూకోజ్‌) కావాలన్నమాట. దీనిని లివర్‌ అందిస్తుంది.

ఇదికాక ఇంకా అదనపు చక్కెర నిల్వ ఉంటే అది మూత్రం ద్వారా బయటకు వస్తుంది. ఇదే డయాబెటిస్‌! దీనివల్ల మూత్రపిండాల (కిడ్నీస్‌) పైన అధిక భారం పడుతుంది.

మన దేహంలోని పాంక్రియాస్‌ అనే అవయవం ఇన్‌సులిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ పాంక్రియాస్‌ జీర్ణకోశానికి పక్కనే ఉంటుంది. చక్కెరను జీర్ణం చేయడంలో పాంక్రియస్‌లే కీలకపాత్ర. చక్కెరను గ్లూకోజ్‌గా మార్చి నిల్వచేయడం, వివిధ శరీర భాగాలకు పంపించడమూ పాంక్రియస్‌ బాధ్యత.

వ్యాధి లక్షణాలు :

* త్వరగా అలసిపోవడం, నీరసం
* శరీరం నిస్సత్తువగా మారడం
* పనిలో ఆసక్తి లేకపోవడం
* నాలుక తడారిపోవడం, విపరీతమైన దాహం
* తడవ తడవకూ మూత విసర్జన చేయడం
* ఎక్కువ ఆహారం తీసుకుంటున్న శరీరం బరువు తగ్గిపోవడం
* కంటి చూపు మందగించడం
* కీళ్ళనొప్పులు
* ఒంటినొప్పులు
* రోగ నిరోధక శక్తి తగ్గడం. తరచు వ్యాధులకు గురికావడం
* కడుపులో నొప్పి
* చర్మం మంటగా ఉండటం. గాయాలు త్వరగా మానకపోవడం
* వృషణాలలో దురద. అంగంలో మంటగా ఉండటం
* సక్‌‌స కోరికలు సన్నగిల్లడం
* చర్మం ముడత పడటం.
* రక్తహీనత
* ఎప్పుడూ పడుకునే ఉండాలనిపించడం.
About Writer
PNR
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి