1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
  4. Gongura health benefits

గోంగూర తింటే కలిగే ప్రయోజనాలు

avoid gongura if you are suffering from kidney stones
గోంగూర. గోంగూరలో క్యాల్షియం, ఇనుము, విటమిన్ ఎ, సి, రైబోఫ్లెవిన్, ఫోలిక్ యాసిడ్ మరియు పీచు ఎక్కువుగా ఉంటుంది. దీని ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాము.
 
రేచీకటి, రాత్రిపూట సరిగా చూపు కనపడక పోవడం అనే నేత్ర రోగంతో బాధపడేవారు గోంగూర తింటే ఫలితం వుంటుంది.
శరీరంలో వాపులు తీయడానికి గోంగూర, వేపాకు కలిపి నూరి వాడితే మంచి ఫలితం ఉంటుంది.
దగ్గు, ఆయాసం, తుమ్ములతో బాధ పడేవారు గోంగూరను తింటే మంచి స్వస్థత చేకూరుతుంది.
శరీరంలో నీరు చేరినప్పుడు ఈ ఆకు కూర పథ్యం చాలా మంచిది. అంతేకాకుండా ఇది మలబద్దకాన్ని తొలగిస్తుంది.
విరోచనాలు అధికంగా అయ్యేటప్పుడు కొండ గోంగూర నుంచి తీసిన జిగురును నీటితో కలిపి త్రాగితే ఉపశమనం లభిస్తుంది. 
గోంగూరలో ఐరన్ ఎక్కువుగా ఉండటం వలన కొంచెం ఎక్కువ తింటే అరగదు. కనుక జాగ్రత్త.
మూత్రపిండాలు లేదా మూత్రాశయంలోని రాళ్లతో బాధపడుతున్న వ్యక్తులు గోంగూరకి దూరంగా వుంటే మంచిది.
About Writer
సిహెచ్
తర్వాతి కథనం
మహిళలూ యవ్వనంగా వుండాలంటే.. జొన్నరొట్టె తినాల్సిందే..