బుధవారం, 22 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 29 ఆగస్టు 2024 (20:03 IST)

టీలో కల్తీని గుర్తించటం ఎలా?: ప్రతి వినియోగదారుడు తెలుసుకోవలసిన అంశాలు

Tea and Tea
ఒక పానీయం కంటే ఎక్కువ, టీ; మన చరిత్రలో అంతర్భాగంగా కలిసిపోయిన ఆచారం మాత్రమే కాదు  ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందికి ఉపశమన  మూలం. అయినప్పటికీ, మనం, మన కప్పుల నుండి టీ రుచులను ఆస్వాదిస్తున్నప్పుడు కూడా, మనం తీసుకునే టీ యొక్క స్వచ్ఛత, ప్రామాణికతను తరచుగా విస్మరిస్తుంటాము. ప్యాకెజీలలో కాకుండా విడిగా విక్రయిస్తున్న టీ పొడిలో కల్తీ సమస్య ఒక ముఖ్యమైన ఆందోళనగా ఉద్భవించింది, ఎక్కువ మందికి ప్రీతి పాత్రమైన ఈ పానీయపు నాణ్యతను దెబ్బతీసే ప్రమాదం ఉంది. కల్తీతో సంబంధం ఉన్న నష్టాలను అర్థం చేసుకోవడం, ప్యాకెట్లలో కాకుండా విడిగా విక్రయించినప్పటికీ అసలైన టీని ఎలా గుర్తించాలో తెలుసుకోవడం అనేది ప్రామాణికమైన, సురక్షితమైన టీ అనుభవాన్ని నిర్ధారించడానికి కీలకమైనది.
 
టీలో కల్తీని అర్థం చేసుకోవడం
టీలో కల్తీ అనేది తేయాకులకు హానికరమైన పదార్ధాలను చేర్చడంతో మొదలవుతుంది, తరచుగా రంగు లేదా రుచికి సంబంధించి టీ రూపాన్ని పెంచే ఉద్దేశ్యంతోనే ఇది జరుగుతుంటుంది. ఈ మోసపూరిత పద్ధతిలలో అనధికారిక రంగులు, రుచులు లేదా ఇతర మొక్కల పదార్థాలను ఉపయోగించడం కూడా ఉండవచ్చు, దీనివల్ల కంటికి లేదా ముక్కుకు మరింత ఆకర్షణీయంగా టీ అనిపించవచ్చు. అయినప్పటికీ, ఈ పదార్థాల జోడింపులు టీ యొక్క స్వచ్ఛతను తగ్గించటమే కాకుండా ముఖ్యమైన ఆరోగ్య ప్రమాదాలను కూడా కలిగిస్తాయి. ఉదాహరణకు, కార్మైన్, బ్రిలియంట్ బ్లూ, సన్ సెట్ యెల్లో, టార్ట్రాజైన్ వంటి సింథటిక్ రంగులు పాడైపోయిన లేదా తక్కువ నాణ్యత గల టీ ఆకులకు వాటి రూపాన్ని మెరుగుపరచడానికి కొన్నిసార్లు జోడించబడతాయి. అయితే, ఈ పదార్థాలను జోడించడానికి చట్టాలు అనుమతించవు, వీటిని వినియోగించటం హానికరం.
 
ఈ కల్తీ పద్ధతులపై అవగాహన కల్పించడంలో టీ బోర్డ్ ఆఫ్ ఇండియా చురుకుగా వ్యవహరిస్తోంది. రసాయన రంగుల టీల వల్ల కలిగే ప్రమాదాలను బోర్డు నొక్కి చెబుతుంది. దురదృష్టవశాత్తూ భారత మార్కెట్‌పై ఈ తరహా టీలు పట్టు సాధించాయి. నిబంధనల ప్రకారం టీలో సింథటిక్ రంగులను ఉపయోగించడం పూర్తిగా నిషేధించబడింది, అయినప్పటికీ అవి ఆందోళనకరంగానే కొనసాగుతున్నాయి. ఈ కల్తీ పదార్థాలు తరచుగా ప్రాసెసింగ్ సమయంలో దెబ్బతిన్న టీ ఆకులను శుద్ధి చేయడానికి ఉపయోగిస్తారు, పోషక విలువలు లేకపోయినా, ఈ తేయాకు మరింత విక్రయించదగినవిగా కనిపిస్తుంది.
 
టీకి రంగులు ఎందుకు కలుపుతారు?
టీలో ఎడిటివ్స్, కలరింగ్ ఏజెంట్లను ఉపయోగించటానికి ప్రాథమిక కారణం టీ తయారీ ప్రక్రియలో దెబ్బతిన్న ఆకులను శుద్ధి చేయటం. టీ బోర్డ్ ఆఫ్ ఇండియా వెల్లడించే దాని ప్రకారం, ఈ దెబ్బతిన్న ఆకులు తక్కువ నాణ్యత కలిగి ఉంటాయి. వీటిని విక్రయించడానికి, వాటి రంగును మెరుగుపరచడానికి ఎడిటివ్స్ జోడించబడతాయి. అయినప్పటికీ, ఈ ఎడిటివ్స్ టీకి ఎటువంటి పోషక విలువలను జోడించవు. పైగా వాటి సంభావ్య ఆరోగ్య ప్రమాదాల కారణంగా ఇవి నిషేధించబడ్డాయి. టీలో కలరింగ్ పదార్థాల వాడకాన్ని అనుమతించబోమని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) స్పష్టం చేసింది. కలరింగ్ ఏజెంట్లతో టీ శుద్ధి చేయటం కల్తీ కేటగిరీ కిందకు వస్తుంది, అలాంటి పద్ధతులు తీవ్ర ఆందోళన కలిగించే అంశంగా మారాయి.
 
ఒక సాధారణ చల్లని నీటి పరీక్ష ద్వారా కల్తీ టీని గుర్తించడం
సరళమైనప్పటికీ, సమర్థవంతమైన పరీక్ష విడిగా విక్రయించే టీ యొక్క ప్రామాణికతను బహిర్గతం చేయడంలో సహాయపడుతుంది. స్పష్టమైన గ్లాసు నీటిలో కొద్ది మొత్తంలో టీ వేయండి. అసలైన టీ ఆకులు క్రమంగా విచ్చుకోవడంతో పాటుగా విస్తరిస్తాయి, అవి నీటిలో నానుతున్న కొద్దీ వాటి సహజ రంగును నెమ్మదిగా విడుదల చేస్తాయి. టీ ఆకులు మారకుండా ఉంటే లేదా నీరు త్వరగా అసహజ రంగులోకి మారితే, ఇది కృత్రిమ రంగులు లేదా ఇతర ఎడిటివ్స్ జోడింపుకు సంకేతం కావచ్చు. సరైన ఇన్ఫ్యూజన్, స్వచ్ఛమైన నీటిలో నెమ్మదిగా విస్తరిస్తున్న టీ ఆకులను చూడటంతో పాటుగా అవి నీటిలో కరుగుతున్న కొద్దీ నీటి రంగు కూడా మారుతుంది.
 
విడిగా విక్రయించే టీ వర్సెస్ ప్యాకేజ్డ్ టీ
విడిగా విక్రయించే టీని, ముఖ్యంగా ధృవీకరించని మూలాల నుండి కొనుగోలు చేసినప్పుడు, కల్తీకి ఎక్కువ ప్రమాదం ఉంది. దీని భారీ విక్రయం, వివరణాత్మక లేబులింగ్ లేకపోవడం నాణ్యత, ప్రామాణికతను అంచనా వేయడం కష్టతరం చేస్తుంది. దీనికి విరుద్ధంగా, ప్రసిద్ధ ప్యాకేజ్డ్ టీ బ్రాండ్‌లు సాధారణంగా తమ ఉత్పత్తులను నిజమైనవిగా నిర్ధారించుకోవడానికి కఠినమైన నాణ్యత నియంత్రణ చర్యలలో పెట్టుబడి పెడతాయి. ఈ బ్రాండ్‌లు తరచుగా తమ సోర్సింగ్, ప్రాసెసింగ్ పద్ధతుల గురించి సమగ్ర సమాచారాన్ని అందిస్తాయి, వినియోగదారులకు వారి కొనుగోళ్లలో ఎక్కువ విశ్వాసం మరియు పారదర్శకతను అందిస్తాయి.
 
మూలాన్ని పరిశోధించడం
మీ టీ నాణ్యతను నిర్ధారించడం అనేది ప్రసిద్ధ, విశ్వసనీయ మూలాల నుండి కొనుగోలు చేయడంతో ప్రారంభమవుతుంది. తమ సోర్సింగ్ ప్రక్రియల గురించి పారదర్శకంగా ఉండే, థర్డ్-పార్టీ టెస్టింగ్‌ని ఉపయోగించుకునే బ్రాండ్‌లు సాధారణంగా మరింత విశ్వసనీయమైనవి, కల్తీ ఉత్పత్తులను అందించే అవకాశం తక్కువ. ప్రశ్నార్థకమైన టీలను నివారించడానికి, టీ యొక్క మూలాన్ని, సరఫరాదారు యొక్క విశ్వసనీయతను పరిశోధించండి. టీ యొక్క ప్రామాణికత, నాణ్యతను ధృవీకరించే సర్టిఫికేషన్లు, కస్టమర్ సమీక్షల కోసం చూడండి. విశ్వసనీయ సరఫరాదారులు సాధారణంగా తమ సోర్సింగ్ పద్ధతులు, నాణ్యత నియంత్రణ పద్ధతుల గురించి వివరణాత్మక సమాచారాన్ని అందిస్తారు, మీ కొనుగోలు గురించి మీకు మానసికంగా శాంతిని అందిస్తారు.
 
సమాచారంతో కూడిన ఎంపికలు చేయడం
టీ ప్రేమికులకు, వారి టీ అనుభవం యొక్క ప్రామాణికతను కాపాడుకోవడానికి విడిగా విక్రయించే టీలో కల్తీ వల్ల కలిగే నష్టాలను అర్థం చేసుకోవడం చాలా కీలకం. కల్తీ సంకేతాలను గుర్తించడం, వదులుగా ఉన్న మరియు ప్యాక్ చేసిన టీ మధ్య తేడాను గుర్తించడం ద్వారా, వినియోగదారులు మరింత సమాచారంతో తగిన నిర్ణయాలు తీసుకోవచ్చు. అధిక-నాణ్యత, నిజమైన టీ కోసం మార్కెట్‌కు మద్దతు ఇవ్వగలరు. టీ ప్రపంచాన్ని అన్వేషించటానికి సూక్ష్మ అంశాల పట్ల కూడా శ్రద్ద, కొంచెం పరిశోధన అవసరం. సరైన పరిజ్ఞానంతో, మీరు ప్రామాణికమైన, ఆహ్లాదకరమైన తేయాకు రుచులను ఆస్వాదిస్తున్నారని తెలుసుకోవటం ద్వారా, మీరు ప్రతి కప్పును ఆత్మవిశ్వాసంతో ఆస్వాదించవచ్చు. అప్రమత్తంగా మరియు తగిన సమాచారం కలిగి ఉండడం ద్వారా, మీరు మీ టీ ఆస్వాదన అనుభవాలను కాపాడుకోవడమే కాకుండా, అధిక-నాణ్యత గల టీ డిమాండ్‌కు సైతం తోడ్పడగలరు.
-డాక్టర్ ఎ. కిరణ్మయి, న్యూట్రియనిస్ట్, టాటా టీ జెమిని