బుధవారం, 18 సెప్టెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఆహారం
Written By సెల్వి
Last Updated : గురువారం, 1 ఆగస్టు 2024 (16:36 IST)

నెలసరి సమయంలో మహిళలు గోంగూరను తీసుకుంటే?

Gongura Leaves
నెలసరి సమయంలో మహిళలు కాళ్లు లాగడం, నడుం వంటి సమస్యలతో బాధపడుతుంటారు. నీరసంగా ఉంటారు. ఇలాంటి సమయంలో గోంగూర తినడం వల్ల వారి శరీరానికి శక్తి లభిస్తుంది. ఎముక‌ల‌ను దృఢంగా ఉంచ‌డంలో, విరిగిన ఎముక‌లు త్వ‌ర‌గా అతుకునేలా చేయ‌డంలో గోంగూర ఉప‌యోగ‌ప‌డుతుంది. 
 
గోంగూరలో మెగ్నీషియం, ఫాస్పరస్, కాల్షియం పుష్కలంగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా మారుస్తుంది. అందుకే 30 దాటిన మహిళలలు గోంగూరను ఆహారంలో భాగం చేసుకోవాలి. 
 
అంతేకాదు, ఈ గోంగూరని తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యం మెరుగ్గా మారుతుంది. దీంతో డ్యామేజ్ అయిన హేయిర్ ఆరోగ్యంగా నిగనిగలాడుతుంది.
 
వారంలో మూడు, నాలుగు సార్లు తీసుకుంటే.. హైబీపిని పూర్తిగా కంట్రోల్ చేస్తుంది. దగ్గు, ఆయాసం, తుమ్ములతో బాధపడేవారికి గోంగూర ఉపశమనం కలిగిస్తుంది.