ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 28 జులై 2024 (22:10 IST)

నిత్య పెళ్లికొడుకు.. 20 పెళ్లిళ్లు చేసుకున్నాడు.. విడాకులు తీసుకున్న మహిళలే టార్గెట్!

marriage
నిత్య పెళ్లికొడుకు.. 20 పెళ్లిళ్లు చేసుకున్నాడు. చివరికి పోలీసులకు చిక్కాడు. విడాకులు తీసుకున్న మహిళలే లక్ష్యంగా చేసుకుని అతను వారిని వలలో వేసుకునేవాడు. పెళ్లయిన తర్వాత డబ్బు, నగలతో పరారయ్యేవాడు. 
 
ఫిరోజ్ బారినపడిన వారిలో మహారాష్ట్ర మహిళలే కాదు, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవారున్నారు. అయితే బాధిత మహిళల్లో కొందరు ధైర్యంగా ముందుకొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు నిత్యపెళ్లికొడుకు ఆటకట్టించారు. 
 
అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు రూ.6 లక్షలకు పైగా డబ్బు, ఒక ల్యాప్ టాప్, కొన్ని సెల్ ఫోన్లు, కొన్ని చెక్ బుక్ లను స్వాధీనం చేసుకున్నారు.