ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 1 జులై 2024 (17:28 IST)

సెల్ఫీ వీడియో కోసం వాటర్ ఫాల్స్‌‍లో దూకిన మాజీ ఆర్మీ జవాన్.. రెండు తర్వాత... (Video)

waterfalls
ఇటీవలికాలంలో సెల్ఫీ వీడియోల మోజులోపడి అనేక మంది యువత నిండు ప్రాణాలను కోల్పోతున్నారు. ఇలాంటి వారిలో చదువుకున్న విద్యావంతులే కాదు.. నిరక్ష్యరాస్యులు, మహిళలు, విద్యార్థినిలు సైతం ఉన్నారు. తాజాగా ఓ మాజీ ఆర్మీ జవాన్ సెల్ఫీ వీడియో కోసం ప్రయత్నించి మృత్యువాతపడ్డారు. వీడియో కోసం వాటర్ ఫాల్స్‌లో దూకడంతో ప్రాణాలు కోల్పోయాడు. 
 
మహారాష్ట్ర రాష్ట్రకు చెందిన స్వప్నిల్ ధావాడే(38) అనే మాజీ ఆర్మీ జవాన్ తన 30 మంది స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్‌కు తమిని ఘాట్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చారు. అక్కడ వీడియో తీయమని స్వప్నిల్ ధావాడే వాటర్ ఫాల్స్‌లో దూకగా నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. ధావాడే కోసం గాలింపు చర్యలు చేపట్టగా, 2 రోజుల తర్వాత మృతదేహం లభించింది. దీంతో అతని కుటుంబ సభ్యులు బోరున విపలిస్తున్నారు.