గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 1 జులై 2024 (10:53 IST)

మహారాష్ట్రలో నడిరోడ్డుపై మొసలి చక్కర్లు .. Shocking Video Viral

మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల ధాటికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జలపాతాల్లో నీటి మట్టాలు విపరీతంగా పెరిగిపోయాయి. అనేక జలాశయాల నుంచి నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. దీంతో ఈ జలపాతాల్లోని మొసళ్లు నీటిలో కొట్టుకుని వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో ఓ భారీ మొసలి ఒకటి రోడ్డుపైకి వచ్చి చక్కర్లు కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రోడ్డుపై నడిచి వెళుతున్న ఈ మొసలిని వాహనదారులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. 

షాకింగ్ వీడియో : లోనావాలా జలపాతంలో కొట్టుకుపోయిన ఓ కుటుంబం 
 
సోషల్ మీడియాలో ఓ షాకింగ్ వీడియో ఒకటి వైరల్ అయింది. లోనావాలా జలపాతంలో ఓ కుటుంబం కొట్టుకునిపోయింది. ఈ వీడియో చూస్తుంటే హృదయ విదారకంగా ఉంది. మహారాష్ట్రలో ఆదివారం రోజు లోనావాలా ప్రాంతంలోని భూషీ డ్యామ్ సమీపంలోని వాటర్ ఫాల్ చూడటానికి కొందరు కుటుంబ సభ్యులు వెళ్లారు. వారంతా వరద నీటి ప్రవాహానికి కొట్టుకుని పోయారు. వరద నీటిలో కొట్టుకునిపోయిన వారిలో ఐదుగురు ఉన్నారు. ఈ ఐదుగురిలో లియాఖత్ అన్సారీ (36), అమీమా ఆదిల్ అన్సారీ (13), ఉమేరా ఆదిల్ అన్సారీ (8)ల మృతదేహాలు లభించగా అద్నాన్ సబాహత్ అన్సారీ (4), మరియా అకిల్ అన్సారీ (9) ఆచూకీ లభించలేదు. 
 
ఆస్తి వివాదం.. హైదరాబాద్‌లో తల్లీ కుమార్తెను గదిలో బంధించి గోడ కట్టేశారు.. ఎక్కడ? 
 
ఆస్తి వివాదం ఓ తల్లీ కుమార్తెను చిక్కుల్లో నెట్టేసింది. ప్రత్యర్థులు ఆ ఇద్దరిని గదిలో బంధించి గోడ కట్టేశారు. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్ నగరంలో జరిగింది. హైదరాబాద్ అంటే మన తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరం కాదండోయ్.. పాకిస్థాన్ దేశంలో ఉన్న హైదరాబాద్ సిటీ. ఈ నగరంలోని లతిఫాబాద్ ప్రాంతంలో ఈ అమానవీయ ఘటన జరిగింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని గోడను బద్ధలు కొట్టి ఆ తల్లీ కుమార్తెలను ప్రాణాలతో రక్షించారు. ఈ షాకింగ్ ఘటన వివరాలను పరిశీలిస్తే....
 
బాధితులు వెల్లడించిన వివరాల మేరకు.. వరుసకు బావ అయిన సుహైల్‌ కుమారులతో కలిసి గతకొంతకాలంగా తీవ్రంగా వేధిస్తున్నారు. ఆస్తి తగాదాల్లో భాగంగానే ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. ఇటీవల అవి మరింత ముదరటంతో తనతో పాటు తన కుమార్తెను ఓ గదిలో బంధించి బయట నుంచి గోడ కట్టారని వాపోయింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు వెళ్లి వారిని రక్షించారు. సుహైల్‌, ఆయన కుమారులపై కేసు నమోదు చేశారు. ఈ దుశ్చర్యకు కారణమైన వారిపై కఠిన సెక్షన్ల కేసు నమోదు చేసి, తగిన శిక్ష పడేలా చేస్తామని స్థానిక పోలీస్ అధికారి ఫరూక్‌ లింజర్‌ తెలిపారు. దీన్ని ఘోరమైన చర్యగా అభివర్ణించిన ఆయన.. మున్ముందు ఈ ఘటనలు జరగకుండా చూస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.