1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : శనివారం, 5 జులై 2025 (15:03 IST)

Sathya: భకాసుర టైటిల్‌ ర్యాప్‌ సాంగ్‌ను ఆవిష్కరించిన అనిల్ రావిపూడి

Anil Ravipudi, sathya and poruder, director
Anil Ravipudi, sathya and poruder, director
క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌, కమెడియన్‌ ప్రవీణ్‌ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం 'బకాసుర రెస్టారెంట్‌', ఈ చిత్రంలో వైవా హర్ష టైటిల్‌ రోల్‌లో నటిస్తున్నారు. కృష్ణభగవాన్‌ ,షైనింగ్‌ ఫణి, కేజీఎఫ్‌ గరుడరామ్‌,ఇతర ముఖ్య పాత్రలో యాక్ట్‌ చేస్తున్నారు. ఎస్‌జే శివ దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ చిత్రాన్ని ఎస్‌జే మూవీస్‌ పతాకంపై లక్ష్మయ్య ఆచారి, జనార్థన్‌ ఆచారి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 
 
చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్దమైంది. హంగర్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలోని బకాసుర టైటిల్‌ ర్యాప్‌ సాంగ్‌ను  బ్లాక్‌బస్టర్‌ మాస్‌ దర్శకుడు అనిల్‌ రావిపూడి విడుదల చేశారు. వికాస బడిస స్వరాలు సమాకూర్చిన ఈ పాటను ర్యాప్‌ సింగర్‌ రోల్‌ రైడ్‌, వికాస బడిస ఆలపించారు. 
 
ఈ సందర్భంగా అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ '' బకాసుర రెస్టారెంట్‌ టైటిల్‌తో పాటు ఈ పాట కూడా బాగుంది. చాలా కొత్తగా అనిపించింది. ఈ సినిమా ఐడియా బాగుంది. నటుడు ప్రవీణ్‌ నాకు మొదట్నుంచి తెలుసు. ప్రవీణ్‌ హీరోగా రాబోతున్న ఈ చిత్రం మంచి సక్సెస్‌ కావాలి. తొలి చిత్ర దర్శకుడు ఎస్‌జే శివతో పాటు అందరికి ఈ చిత్రం మంచి పేరును తీసుకరావాలి' అన్నారు.
 
ఈ సందర్బంగా దర్శకుడు మాట్లాడుతూ '' హంగర్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రతి సన్నివేశం ఆడియన్స్‌కు థ్రిల్లింగ్‌తో పాటు వినోదాన్ని కూడా పంచుతుంది. ఓ ఇన్నోవేటివ్‌ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం తప్పకుండా అందర్ని అలరిస్తుందనే నమ్మకం ఉందిఅతి త్వరలో చిత్ర విడుదల తేదిని ప్రకటిస్తాం. అనిల్‌ రావిపూడి గారు మా సాంగ్‌ను విడుదల చేయడం సంతోషంగా ఉంది. తప్పకుండా చిత్రం అందరికి నచ్చుతుంది' అన్నారు. 
 
ప్రవీణ్‌, వైవా హర్ష, షైనింగ్‌ ఫణి (బమ్‌చిక్‌ బంటి), కేజీఎఫ్‌ గరుడ రామ్‌, కృష్ణభగవాన్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, ఉప్పెన జయకృష్న, వివేక్‌ దండు, అమర్‌, రామ్‌పటాస్‌, రమ్య ప్రియ, ప్రాచీ ఠాకూర్‌, జబర్థస్త్‌ అప్పారావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డీఓపీ: బాల సరస్వతి, ఎడిటర్‌: మార్తండ్‌.కె.వెంకటేష్‌, సంగీతం: వికాస్‌ బడిస, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: వినయ్‌ కొట్టి, ఆర్ట్‌ డైరెక్టర్: శ్రీ రాజా సీఆర్‌ తంగాల, పీఆర్‌ఓ: ఏలూరు శ్రీను, మడూరి మధు, నిర్మాతలు: లక్ష్మయ్య ఆచారి, జనార్థన్‌ ఆచారి, దర్శకత్వం: ఎస్‌జే శివ