ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 28 జులై 2024 (08:41 IST)

తెలంగాణ గవర్నర్‌గా జిష్ణు దేవ్‌వర్మ నియామకం

Jishnu Dev Varma
Jishnu Dev Varma
తెలంగాణ గవర్నర్‌గా జిష్ణు దేవ్‌వర్మ నియమితులయ్యారు. ఈ మేరకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం జిష్ణు దేవ్‌వర్మ నియామకాన్ని ధ్రువీకరించారు. జార్ఖండ్‌తో పాటు తెలంగాణకు అదనపు బాధ్యతలు నిర్వహించిన సీపీ రాధాకృష్ణన్‌ను మహారాష్ట్ర గవర్నర్‌గా నియమించారు. 
 
వీరిద్దరితో పాటు హరిభౌ కిసన్‌రావ్ బాగ్డేను రాజస్థాన్ గవర్నర్‌గా నియమించగా, ఓం ప్రకాష్ మాథుర్‌ను సిక్కిం గవర్నర్‌గా నియమించారు. సంతోష్ కుమార్ గంగ్వార్ జార్ఖండ్ గవర్నర్‌గా, రామెన్ డేకా ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా నియమితులయ్యారు.
 
ఇంకా సీహెచ్ విజయశంకర్ మేఘాలయకు కొత్త గవర్నర్‌గా వ్యవహరిస్తారు. ప్రస్తుతం అస్సాం గవర్నర్‌గా ఉన్న గులాబ్ చంద్ కటారియా పంజాబ్ గవర్నర్‌గా, చండీగఢ్ కేంద్ర పాలిత ప్రాంత నిర్వాహకుడిగా నియమితులయ్యారు. సిక్కిం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య అస్సాం గవర్నర్‌గా నియమితులయ్యారు. ఇంకామణిపూర్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.