ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 3 జులై 2024 (22:25 IST)

యువతికి మత్తు ఇచ్చి మియాపూర్ రోడ్డుపై కదులుతున్న కారులో గ్యాంగ్ రేప్

rape
హైదరాబాద్ నగరం పరిధిలోని మియాపూర్‌లో దారుణం జరిగింది. ల్యాండ్ సైట్ విజిట్ చేయిస్తామనే పేరుతో ఓ యువతిని కారులో తీసుకుని వెళ్లిన ఇద్దరు యువకులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ యువతికి కూల్ డ్రింకులో మత్తు మందు ఇచ్చి అపస్మారకంలోకి జారుకోగానే అఘాయిత్యానికి పాల్పడ్డారు.
 
పూర్తి వివరాలు చూస్తే... యాదాద్రిలో ల్యాండ్ సైట్ విజిట్ ఇద్దరు యువకులు ఓ యువతిని తమ కారులో తీసుకెళ్లారు. అనంతరం హైదరాబాద్ తిరిగి వస్తున్న సమయంలో యువతికి మత్తు మందు ఇచ్చారు. తనపై అఘాయిత్యానికి ఒడిగడుతున్న కామాంధులకు తను అనారోగ్యంగా వున్నానని బాధితురాలు చెప్పినా పట్టించుకోలేదు. నాలుగు గంటలపాటు కారులో తిప్పుతూ ఆమెపై అత్యాచారం చేసారు. ఉప్పల్ శివారు ప్రాంతంలో బాధితురాలు వారి బారి నుంచి తప్పించుకుని పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసింది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.