1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 20 జూన్ 2024 (13:00 IST)

రీల్స్ పిచ్చి, ఎత్తైన భవనం పైనుండి ఒక చేతితో పట్టుకుని వేలాడుతున్న యువతి (video)

Reels crazy in Pune
ఇటీవలే రీల్స్ పిచ్చిలో ఓ యువతి కారును మెల్లగా వెనక్కి నడుపుతూ వెళ్లి సమీపంలో వున్న లోయలో కారుతో సహా పడిపోయి ప్రాణాలు కోల్పోయింది. ఇక సముద్రం, నదులు, నడుస్తున్న రైళ్లు, క్రూర మృగాల వద్ద... ఇలా అనేక రకాలుగా రీల్స్ చేయాలని ప్రయత్నించి ప్రాణాలు పోగొట్టుకుంటున్నవారు ఎందరో.
 
తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. పూణే - జంబుల్‌వాడి స్వామినారాయణ మందిర్ సమీపంలోని ఒక పాడుబడిన భవనంపై ఒక యువకుడు మరో యువతిని ఒక్క చేతితో పట్టుకుంటే ఆమె అక్కడ నుంచి వేలాడుతూ కనిపించింది. ఇలా ప్రాణాలను ప్రమాదంలో నెట్టి చేసిన వీడియోను సోషల్ మీడియాలో పెట్టారు. ఇది వైరల్ అవుతోంది. ఐతే దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రీల్స్ పిచ్చిలో కన్నతల్లిదండ్రులకు క్షోభ మిగిల్చే పనులు చేయకండి అంటూ హితవు పలుకుతున్నారు.