ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 2 జులై 2024 (14:50 IST)

యువతి మిస్సింగ్ కేసు.. పవన్ జోక్యంతో చేధించారు.. జమ్మూలో 9 నెలల తర్వాత?

pawan kalyan
యువతి మిస్సింగ్ కేసును బెజవాడ పోలీసులు చేధించారు. ఈ కేసులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జోక్యం చేసుకోవడంతో యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదృశ్యమైన యువతి విజయవాడ రామవరప్పాడుకు చెందిన యువకుడితో జమ్మూలో ఉన్నట్లు గుర్తించి ఇద్దరినీ అదుపులోకి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
ఏపీలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన జనసేనాని పవన్ కళ్యాణ్ ఆదేశాలతో యువతి మిస్సింగ్ కేసుపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన నగర పోలీసు కమిషనర్ ఈ కేసును కొద్ది రోజుల్లోనే చేధించారు. 
 
తన కుమార్తె అదృశ్యమై 9 నెలలు అయ్యిందని యువతి తల్లి పవన్ కల్యాణ్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో తొమ్మిది నెలల తర్వాత యువతి ఆచూకీ లభ్యమైంది. దీంతో పోలీసులు జమ్మూ నుంచి విజయవాడకు యువతి, యువకుడిని పోలీసులు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.