గురువారం, 4 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 2 జులై 2024 (09:48 IST)

మీరు చేసిన నినాదాలతో ప్రకృతి కూడా బయపడిపోయింది.. అందుకే డిప్యూటీ సీఎంను చేసింది : పవన్ కళ్యాణ్ (Video)

Pawan kalyan
తన అభిమానులు, జనసైనికులు, వీరమహిళలు సీఎం సీఎం అంటూ చేసిన నినాదాలతో ప్రకృతి సైతం భయపడిపోయిందని, అందుకే ఉప ముఖ్యమంత్రిని చేసిందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. పిఠాపురం జనసేన కార్యకర్తలతో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, తాను ఎలాంటి పదవులకు ఆశపడే వ్యక్తిని కాదన్నారు. కానీ, ప్రజలకు మాత్రం తన శక్తిమేరకు పని చేయాలన్న సంకల్పం ఉందన్నారు. అయితే, మీరు చేసిన నినాదాలు ప్రకృతి సైతం భయపడిపోయిందన్నారు. అందుకే ప్రకృతి ఈ ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టిందన్నారు. ఇపుడు మరింత బాధ్యతాయుతంగా పని చేయాల్సిన కర్తవ్యం ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. 
 
ఇకపోతే, వైకాపా ప్రభుత్వంలో ఇక్కడి చెకోపోస్టుల్లో అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి పేరు చెబితే వదిలేశారు. కానీ నేపాల్ పోలీసులకు వీళ్లెవరో తెలీదు కదా. అక్కడ ఆపేశారు. ఆరా తీస్తే తిరుపతి నుంచి వచ్చాయని తేలింది. ఇప్పుడా ఆ ఫైల్ నా దగ్గరకు వచ్చింది. ఆ ఎర్రచందనాన్ని తీసుకురావడానికి కిందామీదా పడుతున్నాం. దీన్నిబట్టి మన చెకోపోస్టులు ఎంత అలసత్వంగా ఉన్నాయో అర్ధమవుతోంది అని అన్నారు. 'అడవిని కొట్టడం సులువే. పెంచడం ఎంత కష్టమో తెలుసా? అన్నానికి బదులు మీరు డబ్బు తింటారా?' అని వైకాపా నాయకులను పవన్ ప్రశ్నించారు. బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని. దీని వెనుకున్న సూత్రధారులను పట్టుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్కు చెప్పినట్లు పవన్ తెలిపారు.