సంబంధిత వార్తలు
- ఇంద్ర లోకం నాది.. శివుడే నా భర్త.. ఏపీలో వేరొక లోకం.. మహిళ, పిల్లలు?
- జైపూర్ విమానాశ్రయం: ఏఎస్ఐ చెంప ఛెల్లుమనిపించిన మహిళ.. ఎందుకు? (video)
- బ్రిటన్‌లో చరిత్ర సృష్టించిన శివానీ రాజా... భగవద్గీతపై ప్రమాణం!! (Video)
- ముస్లిం మహిళలు కూడా భరణం పొందే హక్కు ఉంది : సుప్రీం కీలక తీర్పు
- ముస్లిం మహిళైతేనేం.. విడాకుల తర్వాత భరణం చెల్లించాల్సిందే
మునగాకు నూనె గురించి విన్నారా.. ఆరోగ్యానికి ఎంత మేలంటే?
Moringa Oil
ఇక ఆయుర్వేదం సిఫార్సు చేసే కూరల్లో మునగాకు ముఖ్యమైంది. మునగలో ఐరన్ పుష్కలంగా వుంటుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే మునగాకు నూనెలోని మహిమ తెలిస్తే అస్సలు వదులుకోం. మునగ ఆకులు, కాయలు మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అలాగే మునగాకు నూనె కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
మునగ నూనెను మునగ చెట్టు విత్తనాల నుంచి తీస్తారు. ఈ నూనెలో అద్భుతమైన పోషకాలకు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో విటమిన్ ఎ, ఇ, సి, బి, యాంటీ ఆక్సిడెంట్లు, కొవ్వు పదార్థాలు అధికంగా లభిస్తాయి. మునగాకు నూనె లోని పోషకాలు హెయిర్ ఫోలికల్స్‌కు బలాన్నిస్తాయి. ఇది జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది.
మునగ వంట నూనెలో స్టిరాల్స్ ఉంటాయి. ఇవి మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో సాయపడతాయి. మునగ నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి.
యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉండటం వల్ల చర్మానికి అప్లై చేసి మర్ధనా చేయటం వల్ల చర్మం యాక్నె సమస్య తగ్గుతుంది. మునగ నూనెలో విటమిన్ సి, ఇ సమృద్ధిగా లభిస్తాయి. ఇవి చర్మంపై ఉండే మచ్చలు పూర్తిగా తొలగిపోయేలా చేస్తాయి.
తర్వాతి కథనం
