1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
  4. Mosambi health benefits

బత్తాయి రసాన్ని వేసవిలో తప్పక తీసుకోవాల్సిందేనా?

Mosambi
Mosambi
బత్తాయి రసాన్ని వేసవిలో తప్పకుండా తీసుకోవాలి. ఈ జ్యూస్ తీసుకోవడం ద్వారా వేసవిలో శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. దీనిలో విటమిన్‌-సి పుష్కలంగా.. కాల్షియం, పొటాషియం, కాపర్‌ ఖనిజ పోషకాలు మెండుగా ఉంటాయి. 
 
ఈ విటమిన్లు, ఖనిజాలు కావాల్సినంత రోగనిరోధక శక్తినిస్తాయి. ఆహారం సరిగా జీర్ణమవుతుంది. చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారు, తక్కువ కెలోరీలు కావాలనుకునేవారు బత్తాయి రసాన్ని తీసుకోవాలి. 
 
ఈ పండులోని విటమిన్‌-సి యాంటీ ఆక్సిడెంటుగా పనిచేసి ఫ్రీరాడికల్స్‌ను నిర్మూలించి రోగనిరోధకతను పెంచుతుంది. క్యాన్సర్‌, గుండెజబ్బులు రాకుండా అడ్డుకుంటుంది. బత్తాయిలోని ఫ్లేవనాయిడ్లు.. జీర్ణరసాలు, ఆమ్లాలు స్రావితమయ్యేలా చేసి అజీర్తి, మత్తును పోగొడతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
రక్తంలోని మలినాలను తొలగించాలంటే ఒకటే మార్గం