1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
  4. white sesame powder in milk and drink it

తెల్లనువ్వుల పొడిని పాలలో కలుపుకుని తాగితే....

white sesame powder
గ్లాస్ మరిగించిన పాలలో స్పూన్ దాల్చిన చెక్క పొడి, కొద్దిగా మిరియాల పొడి కలిపి తాగితే ఎముకల బలానికి ఎంతో సహాయపడుతుంది. గ్లాస్ గోరువెచ్చని నీటిలో కొద్దిగా తేనె, పిప్పళ్ల చూర్ణం కలిపి తీసుకుంటే ఎముకలు దృఢంగా ఉంటాయి.

 
ప్రతిరోజూ మీరు తాగే పాలలో కొద్దిగా అల్లం రసం, తేనె కలిపి సేవిస్తే ఫలితం ఉంటుంది. తెల్ల నువ్వులను వేయించి పొడి చేసుకోవాలి. ఈ పొడిలో కొద్దిగా చక్కెర, పాలు కలిపి రోజూ ఉదయాన్నే తీసుకోవాలి. ఇలా తరచుగా క్రమం తప్పకుండా చేస్తే కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి. 

 
క్యాల్షియం పరిమాణం ఎక్కువగా ఉన్న పెరుగు, బాదం పప్పు, పాలకూర, మునగాకు, పాలు, గుడ్లు వంటివి నిత్యం ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎముకలు దృఢంగా మారుతాయని చెప్తున్నారు.
తర్వాతి కథనం
45 ఏళ్ల మహిళ పొత్తికడుపు నుంచి అరుదైన ఫైబ్రాయిడ్‌ను తొలగించిన కామినేని హాస్పిటల్స్ వైద్యులు