సోమవారం, 25 సెప్టెంబరు 2023
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 24 ఫిబ్రవరి 2022 (19:33 IST)

45 ఏళ్ల మహిళ పొత్తికడుపు నుంచి అరుదైన ఫైబ్రాయిడ్‌ను తొలగించిన కామినేని హాస్పిటల్స్ వైద్యులు

అరుదైన విధంగా, రెడ్ డిజనరేషన్‌తో కూడిన ఫైబ్రాయిడ్‌తో బాధపడుతున్న, విజయవాడకు చెందిన 45 ఏళ్ల మహిళకు కామినేని హాస్పిటల్స్ వైద్యులు నూతన జీవితాన్ని ప్రసాదించారు. రెండు నెలలుగా పొత్తికడుపు దిగువభాగంలో నొప్పితో బాధపడుతున్న ఆ మహిళను విజయవాడలోని కామినేని హాస్పిటల్‌కు తీసుకువచ్చారు.

 
ఆ మహిళకు అప్పుడప్పుడు జ్వరం కూడా వచ్చేది. అయితే అది వెంటనే తగ్గేది. పొత్తికడుపు నొప్పి రుతుస్రావానికి సంబంధించింది కాదు. నొప్పి నివారిణులతో నొప్పి కాస్తంత తగ్గేది. ఆమెకు రుతుచక్రం సరిగానే ఉండింది. సంబంధిత మిగితా అంశాలన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఆమెకు 2 సార్లు సిజేరియన్ డెలివరీలు జరిగాయి.

 
పొత్తికడుపు, పెల్విస్ అల్ట్రాసౌండ్‌తో వైద్యులు ఇతర పాథాలజీ ఏమీ లేకుండా 4X3 సెం.మీ. యాంటిరియర్ వాల్ ఇంట్రామురల్ ఫైబ్రాయిడ్‌ను గుర్తించారు. హై-డోస్ కాంట్రాస్ట్- ఎన్‌హేన్స్‌డ్ కంప్యూటెడ్ టోమోగ్రఫీ (సీఈసీటీ)తో ఆ ఫైబ్రాయిడ్ పొడవునా మల్టీప్లెటినీ రెనల్ కాల్‌కులిని గుర్తించారు. రోగితో చర్చించిన అనంతరం వైద్యులు టోటల్ లాప్రోస్కోపిక్ హిస్టెరెక్టమీ చేశారు. పొత్తికడుపు ముందు గోడకు ఒమెంటల్ అడ్ హెసిన్స్ ఉన్నట్లుగా గుర్తించారు. రెండు పక్కలా నాళాలు, అండాశయాలు ఆరోగ్యకరంగా ఉన్నాయి.

 
స్పెసిమెన్ కట్ సెక్షన్‌ను పరీక్షించిన తరువాత ఫైబ్రాయిడ్ లోపలి భాగంలో స్రవిస్తున్న భాగాలు ఉన్నట్లుగా గుర్తించారు. హిస్టోపాథొలాజికల్ ఎగ్జామినేషన్ సందర్భంగా రెడ్ డిజనరేషన్ ధ్రువీకరించబడింది. ఆపరేషన్ తరువాత ఎలాంటి ఇతర పరిణామాలు చోటుచేసుకోలేదు. 100 శాతం ఆమెకు నొప్పి తగ్గింది. ఫైబ్రాయిడ్ రెడ్ డిజనరేషన్ నుంచే ఆ నొప్పి వస్తున్నట్లుగా స్పష్టమైంది. ఫైబ్రాయిడ్ యుటెరస్ కలిగిన మహిళలు(గర్భవతులు కానివారు) స్వల్ప జ్వరం, పొత్తికడుపు నొప్పి కలిగిఉంటే, అత్యంత సాధారణం కానప్పటికీ, అది రెడ్ డిజనరేషన్ అయి ఉండవచ్చు అని కూడా అనుమానించాలనే పాఠాన్ని ఇది నేర్పింది.

 
ఈ సందర్భంగా విజయవాడ కామినేని హాస్పిటల్స్ సీనియర్ అబ్స్టెట్రిషియన్, గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రీ రమ్య కంటిపూడి మాట్లాడుతూ, ‘‘గర్భాశయంలో ఫైబ్రాయిడ్ అనేది సంతానోత్పత్తి వయస్సులో ఉన్న మహిళల్లో అత్యంత సాధారణం. అది ఎలాంటి లక్షణాలు లేకుండా లేదా రుతుచక్ర సంబంధిత సమస్యలు, పొత్తికడుపులో గడ్డలు, నొప్పి, మూత్రవిసర్జన సమస్యలు, ప్రెషర్ సింప్టమ్స్, అనీమియా వంటి వివిధ రకాల లక్షణాలతో కూడా ఉండవచ్చు.

 
ఫైబ్రాయిడ్స్ అనేవి హయలైన్, కాల్కేరియస్, ఫ్యాటీ, మైగ్జొమాటస్, రెడ్ డిజనరేషన్స్ వంటి వివిధ రకాల డిజనరేషన్స్‌కు లోనవుతుంటాయి. ఫైబ్రాయిండ్ రెడ్ డిజనరేషన్ అనేది (కార్నేయస్ డిజనరేషన్) అరుదు. 3% మాత్రమే ఇలాంటివి చోటుచేసుకుంటూ ఉంటాయి. అలాంటి గర్భధారణ సందర్భంగా చోటుచేసుకుంటుందని వైద్యశాస్త్ర గ్రంథాల్లో సూచించారు. అయితే, గర్భవతులు కాని మహిళల్లోనూ అది అరుదుగా కనిపిస్తుంటుంది. అన్ని ఫైబ్రాయిడ్లను తొలగించాల్సిన అవసరం లేదు, అలాగని ఫైబ్రాయిడ్స్ అన్నిటినీ నిర్లక్ష్యం కూడా చేయకూడదు. వాటికి సంబంధించి సకాలంలో తగిన చర్య తీసుకోవాలి” అని అన్నారు.