మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (12:39 IST)

నీట్ పీజీ పరీక్షలు వాయిదా - 6-8 వారాల పాటు పోస్ట్‌పోన్

పోస్ట్ గ్యాడ్యుయేట్ మెడికల్ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పీజీ ప్రవేశ పరీక్ష 2022 వాయిదాపడింది. షెడ్యూల్ ప్రకారం మార్చి 12వ తేదీన నిర్వహించాల్సివుంది. కానీ, ఈ పరీక్షలను 6-8 ఎనిమిది వారాల పాటు వాయిదా వేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 
 
ఈ మేరకు పరీక్షను వాయిదా వేయాలని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్‌కు సమాచారం అందించింది. ప్రస్తుతం పీజీ 2021 కౌన్సెలింగ్ ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో ఈ పరీక్షను వాయిదా వేసినట్టు తెలుస్తుంది. త్వరలోనే ఈ ప్రవేశ పరీక్ష తేదీని వెల్లడించే అవకాశం ఉంది. 
 
నిజానికి నీట్ పీజీ ప్రవేశపరీక్షను వాయిదా వేయాలని కోరుతూ ఆరుగురు వైద్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోవిడ్ కారణంగా ఈ యేడాది చాలా మంది ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్స్ తమ ఇంటర్నెషిఫ్‌ను ఇంకా పూర్తి కాలేదని, అందువల్ల పరీక్షను మరో తేదీలో నిర్వహించాలని కోరింది. దీన్ని సుప్రంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నేపథ్యంలో నీట్ పీజీ పరీక్షను వాయిదా వేయాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది.