గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 25 సెప్టెంబరు 2021 (14:12 IST)

కరోనాను తరిమికొట్టేందుకు మరో 8 వారాలు వేచి చూడాలి

కరోనా మహమ్మారిని పారద్రోలడానికి మరో 6 నుంచి 8 వారాల పాటు జాగ్రత్తగా ఉండాలని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా పేర్కొన్నారు. అన్ని జాగ్రత్తలు పాటిస్తే కోవిడ్‌కు ముందు పరిస్థితులను మళ్లీ చూడొచ్చని అన్నారు. మహమ్మారి పూర్తిగా పోయిందనుకోవద్దని రాబోయే పండగల సీజన్‌లో జాగ్రత్తగా వ్యవహరించడం కీలకమని సూచించారు.
 
కోవిడ్‌ వ్యాక్సిన్‌ రోగాన్ని తీవ్రతరం కాకుండా చూస్తుందని, టీకా తీసుకున్నవారికి కొవిడ్‌ సోకినా తేలికపాటి దశకే పరిమితమవుతుందన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారి నుంచి తీసుకోనివారికి వైరస్‌ సోకితే ప్రమాదం తీవ్రమయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఈ మేరకు అంతా తగిన జాగ్రత్తలతో ఉండాలని హెచ్చరించారు. ప్రస్తుతం దేశంలో రోజురోజుకీ వైరస్‌ తిరోగమనంలో ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో ఎవ్వరూ నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని ఆయన స్పష్టం చేశారు.