శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 24 జులై 2021 (13:06 IST)

పుట్టగొడుగుల్లా కొత్త వేరియంట్లు.. కరోనా బూస్టర్ డోస్ తప్పదా?

దేశంలో కరోనా వైరస్ కొత్త కొత్త రూపాల్లో వెలుగు చూస్తోంది. ఇప్పటికే దేశంలో అనేక రకాలైన కరోనా వేరియంట్లను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ నేపథ్యంలో కొవిడ్​-19 వ్యాక్సిన్​ బూస్టర్​ డోసు కూడా వేసుకోవాల్సిన‌ అవసరం రావ‌చ్చ‌ని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్​దీప్ గులేరియా అభిప్రాయపడ్డారు. 
 
ఇకపోతే, పిల్లలకు కరోనా టీకాపై భారత్​ బయోటెక్ చేపట్టిన క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు సెప్టెంబర్​ నాటికి వస్తాయని భావిస్తున్నట్లు తెలిపారు. చిన్నారులపై ఇప్పటికే ప్రయోగాలు జరుగుతున్నాయన్నారు. 2 నుంచి 12 ఏళ్ల లోపు వయస్సు వారి కోసం భారత్​ బయోటెక్​ సంస్థ అభివృద్ధి చేస్తున్న కొవాగ్జిన్​ టీకా.. రెండో, మూడో దశ క్లినికల్​ ట్రయల్స్​ కొనసాగుతున్నాయని వివరించారు. 
 
సెప్టెంబరు చివరి నాటికి భార‌త్‌లో చిన్నారులకు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంద‌ని ర‌ణ్‌దీప్ గులేరియా అన్నారు. జైడస్‌ క్యాడిలా తయారు చేసిన టీకా చిన్నారులపై ప్రయోగాలు పూర్తయ్యాయి. టీకా వినియోగ అనుమతి కోసం డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ)కు దరఖాస్తు చేసుకుందని చెప్పారు.