ఆదివారం, 17 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 28 జనవరి 2022 (09:18 IST)

చెన్నైలో ధోనీ... ఫిబ్రవరి 12 నుంచి ఐపీఎల్ మెగా వేలం పాట

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చెన్నైకు చేరుకున్నారు. వచ్చే నెల 12వ తేదీ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్ కోసం ఆటగాళ్ళ వేలం పాటలు జరుగనున్నాయి. ఈ పాటల్లో పాల్గొనేందుకు ఆయన చెన్నైకు వచ్చారు. ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో ఐపీఎల్ వేలం పాటలు జరుగనున్నాయి. అప్పటివరకు ఆయన చెన్నైలో ఉండి ఆటగాళ్ల ఎంపిక తదితర అంశాలపై చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ నిర్వాహకులతో సమాలోచనలు జరుపనున్నారు. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ ట్విట్టర్‌లో ధోని ఫోటోను షేర్ చేసి తెలిపింది. 
 
"అవును, అతను ఈ రోజు చెన్నైకి వచ్చాడు. వేలం పాట చర్చల కోసం అతను ఇక్కడే ఉంటాడు. అతను వేలానికి హాజరయ్యే అవకాశం ఉంది" అంటూ ట్వీట్ చేసింది. కాగా, ధోనీని ఈ యేడాది కూడా చెన్నై సూపర్ కింగ్స్ 12 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిన విషయం తెల్సిందే. 
 
అలాగే, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కొనుగోలు (రీటైన్) చేసిన ఆటగాళ్ళలో రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీతో సహా నలుగురు ఆటగాళ్లను రిటైన్ ఉన్నారు. 
 
ఇందులో జడేజాను రూ.16 కోట్లకు అట్టిపెట్టుకోగా, ధోనీ రూ.12 కోట్లకు కొనుగోలు చేసింది. అలాగే, అలీని రూ.8 కోట్లకు రిటైన్ చేయగా, గైక్వాడ్ రూ.6 కోట్లకు దక్కించుకుంది.