గురువారం, 3 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 26 జనవరి 2022 (16:19 IST)

అల్లు అర్జున్ కు వంద‌కోట్ల ఆఫ‌ర్ వ‌చ్చింది!

Atly- Arjun
అల్లు అర్జున్ అల‌వైకుంఠ‌పురంలో త‌ర్వాత హీరోగా స్పాన్ పెరిగింది. ఇటీవ‌లే పుష్ప సినిమా ఆయ‌న్ను పాన్ ఇండియా స్థాయికి చేర్చింది. తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళంతోపాటు హిందీలో కూడా విడుద‌లైన ఈ సినిమాకు మొద‌ట్లో డివైడ్ టాక్ వ‌చ్చింది. కానీ క్ర‌మేణా అల్లు అర్జున్‌కు ఆద‌ర‌ణ పెరిగింది. బాలీవుడ్‌లో పెట్టిన పెట్టుబ‌డికి మూడు రెట్లు ఇప్ప‌టికే వ‌చ్చింద‌ని ట్రేడ్‌వ‌ర్గాలు తెలియ‌జేస్తున్నాయి.
 
ఈ సినిమాకు సీక్వెల్ గా `పుష్ప ది రూల్‌`` అనే సెట్‌పైకి వెళ్ళ‌బోతుంది. మార్చి 25న షూటింగ్ ప్రారంభం కానున్న‌ద‌ని స‌మాచారం. అయితే ఈలోగా త‌మిళంలో పేరు పొందిన అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేయ‌బోతున్న‌ట్లు తెలిసింది. 2.0, ద‌ర్బార్‌, క‌త్తి సినిమాల‌ను నిర్మించిన లైకా ప్రొడక్ష‌న్స్ ఈ చిత్రానికి నిర్మించ‌నుంది. ఇందుకు గాను వంద కోట్ల ఆఫ‌ర్‌గా ఇచ్చిన‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే పుష్ప క‌లెక్ష‌న్ల‌పై అల్లు అర్జున్‌కు బాలీవుడ్‌లో వున్న ఆద‌ర‌ణ ప‌ట్ల ప‌లువురు స్పందించిన తీరు తెలిసిందే. తాజాగా కంగ‌నా ర‌నౌత్ కూడా స్పందించింది. దీనితో అల్లు అర్జున్‌కు డిమాండ్ పెరిగిన‌ట్ల‌యింది.