గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 22 జనవరి 2022 (11:27 IST)

డేవిడ్ వార్నర్ 'పుష్పరాజ్': మాటే బంగారమాయెనే శ్రీవల్లీ... సామీ నీ డ్యాన్స్ అదుర్స్

ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ సినిమా విడుదలైందంటే ఆ చిత్రంలోని పాటలకు స్టెప్పులు ఇరగదీస్తాడు. ఇప్పటికే ఇలాంటివి చేసి తెలుగు సినిమా అభిమానిగా తనకంటూ ఓ క్రేజ్ సంపాదించుకున్నాడు. డేవిడ్ తన తాజా వీడియోలో, శ్రీవల్లి నుండి అల్లు అర్జున్ స్టెప్పులను అనుకరించాడు.

 
డేవిడ్ తన ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో షేర్ చేసిన వీడియోలో సన్ గ్లాసెస్ ధరించి, మాటే బంగారమాయెనే శ్రీవల్లి అనే పాట ప్లే అవుతున్నప్పుడు పక్కకి స్టెప్పులు వేస్తూ జరిగాడు. ఆ తర్వాత తగ్గేదేలే అన్నట్లు చేయి ఊపాడు. డేవిడ్ ఈ వీడియోను అనేక నవ్వుతున్న ఎమోజీలతో "పుష్పా, తదుపరి ఏమిటి?" అనే టెక్స్ట్‌తో పంచుకున్నారు.

 
ఈ వీడియో అప్ చేసిన 20 గంటల్లోనే సుమారు 14 లక్షల మంది లైక్ చేసారు. ఎంతోమంది కామెంట్లతో ముంచేస్తున్నారు. కొందరైతే... సామీ నీ డ్యాన్స్ అదుర్స్, టాలీవుడ్ ఇండస్ట్రీలో నువ్వు సినిమా చేస్తే బాక్సాఫీస్ బద్ధలే అంటూ కామెంట్లు చేస్తున్నారు.