1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
  4. How to choose best foods for this monsoon

వర్షాకాలంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

వర్షాకాలంలో అనారోగ్య సమస్యల బారినపడకుండా ఉండాలంటే మరింత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా తీసుకునే ఆహారంలోనూ జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే... ఈ కాలంలో జీర్ణవ్యవస్థ పనితీరు మందగిస్తుంది.

monsoon
వర్షాకాలంలో అనారోగ్య సమస్యల బారినపడకుండా ఉండాలంటే మరింత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా తీసుకునే ఆహారంలోనూ జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే... ఈ కాలంలో జీర్ణవ్యవస్థ పనితీరు మందగిస్తుంది. అందువల్ల ఏది పడితే అది తింటే అజీర్తి సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఏం తినాలో తెలుసుకుందాం.
 
* వర్షాకాలంలో వీలైనంత మేరకు పచ్చి కూరగాయల బదులు మరిగించిన సలాడ్‌లు తీసుకోండి.
* ఆపిల్‌, దానిమ్మ, అరటిపండ్లను ఎక్కువగా తినాలి. ఇవి ఆరగించడం వల్ల తక్షణ శక్తిని పొందవచ్చు. 
* అల్లం, మిరియాలు, తేనె, పుదీనాతో తయారు చేసిన హెర్బల్‌ టీలు తీసుకోండి. వీటిలో యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలుంటాయి.
 
* తాజా ముల్లంగి రసాన్ని తాగితే దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది.
* మొక్కజొన్న, శనగపిండి, శనగలతో చేసిన ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమం. 
* బ్రౌన్‌రైస్‌, ఓట్స్‌, బార్లీలకు ప్రాధాన్యం ఇవ్వాలి. 
 
* వెల్లుల్లిని సూప్‌లలో, కూరలలో విధిగా వేయండి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సాయపడుతుంది. 
* కాకరకాయ, పసుపు పొడి, మెంతులను ఆహారంలో భాగం చేసుకోండి. ఇవి ఇన్‌ఫెక్షన్ల బారినుంచి మిమ్మల్ని కాపాడుతాయి. 
* పల్లి, ఆముదం, నువ్వుల నూనె బదులు తేలికగా ఉండే మొక్కజొన్న నూనెను వంటలలో ఉపయోగించండి. 
About Writer
pnr
తర్వాతి కథనం
పులుపు ఎక్కువ తింటే ఏమిటి? తక్కువ తింటే ఏమిటి?