సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By pnr
Last Updated : గురువారం, 13 సెప్టెంబరు 2018 (15:26 IST)

మహిళలు ఎందుకు వ్యాయామం చేస్తారంటే...

ఉరుకుల పరుగుల జీవితంలో కొంతమంది మహిళలు తమ ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతున్నారు. ముఖ్యంగా, నగరాలు, పట్టణాల్లో నివశించే మహిళలు మాత్రం ఇంటిపట్టునే ఉంటూ వ్యాయామం చేస్తుంటారు. ప్రధానంగా ఆరోగ్య రక్షణతోపాటు, శరీరాక

ఉరుకుల పరుగుల జీవితంలో కొంతమంది మహిళలు తమ ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతున్నారు. ముఖ్యంగా, నగరాలు, పట్టణాల్లో నివశించే మహిళలు మాత్రం ఇంటిపట్టునే ఉంటూ వ్యాయామం చేస్తుంటారు. ప్రధానంగా ఆరోగ్య రక్షణతోపాటు, శరీరాకృతిని కాపాడుకునేందుకు మహిళలు జిమ్‌కెళ్లి కసరత్తులు చేస్తున్నారు.
 
ఈ తరహా వ్యాయామం, జిమ్‌లో కసరత్తుల వల్ల శరీరాకృతితో పాటు, ఆరోగ్యం లభిస్తుందని వ్యాయామ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వ్యాయామం చేసే మహిళలు వైద్యులు సూచించిన ఆహారాన్ని తీసుకుంటే శరీరం ఫిట్‌గా తయారు కావడంతో పాటు శరీరాకృతి లభిస్తుందని వారు చెబుతున్నారు. 
 
జిమ్‌కెళ్లి కసరత్తుకు వెళ్లి మహిళలు తప్పనిసరిగా కేలరీస్‌, కార్బోహైడ్రీడ్స్‌ తక్కువగా లభించే అహారాన్ని తీసుకోవాలి. కాంప్లెక్స్‌ కార్బోహైడ్రీడ్‌లైన గోధుమలు, ముడిబియ్యం, చిలుకడ దుంపల్లో లభించే ప్రోటిన్‌ ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం లాభదాయకంగా ఉంటుందని వారు చెబుతున్నారు. ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల మహిళల ఆరోగ్యంగా, చలాకీ ఉంటారు.