శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 11 సెప్టెంబరు 2018 (16:25 IST)

పళ్లపై పచ్చని గార మాయం కావాలంటే...

చాలా మందికి దంతాలపై (ముఖ్యంగా ముందు పళ్ళపై) పచ్చని గార ఉంటుంది. దీన్ని పోగొట్టుకునేందుకు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. నోట్లోని మంచి, చెడు బ్యాక్టీరియాల మధ్య సమతౌల్యత దెబ్బ తినడం వల్ల పళ్ళపై ఈ

చాలా మందికి దంతాలపై (ముఖ్యంగా ముందు పళ్ళపై) పచ్చని గార ఉంటుంది. దీన్ని పోగొట్టుకునేందుకు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. నోట్లోని మంచి, చెడు బ్యాక్టీరియాల మధ్య సమతౌల్యత దెబ్బ తినడం వల్ల పళ్ళపై ఈ గార ఏర్పడుతుంది.
 
ఈ పచ్చని గార వల్ల పిప్పిపళ్లు రావడంతోపాటు తగిన చికిత్స కల్పించకపోతే దీర్ఘకాలంలో గుండె జబ్బులు, మధుమేహం వంటివి వచ్చే అవకాశమూ ఉంది. ఈ నేపథ్యంలో నోటిలోని చెడు బ్యాక్టీరియాను తగ్గించేందుకు పరిశోధకులు నానో టెక్నాలజీ ఆధారిత విధానాన్ని కనుగొన్నారు. 
 
ఇది నోట్లో దాగి ఉన్న హానికారక బ్యాక్టీరియాను గుర్తించడంతోపాటు నాశనం చేస్తుంది. తద్వారా దంతాలపై ఉన్న పచ్చని గార చెడిపోతుంది. ప్రోబ్‌లో హాఫీనియం ఆక్సైడ్‌తో కూడిన నానో కణాలు ఉంటాయని, కొన్ని రకాల ఎలుకలపై క్లోరోహెక్సిడైన్‌ అనే మందుతో కలిపి ఈ ప్రోబ్‌ను ఉపయోగించినప్పుడు మెరుగైన ఫలితాలు వచ్చాయని వివరించారు. 
 
యాంటీబయాటిక్‌ మందులు వాడాల్సిన అవసరం లేకుండానే గారను తొలగించేందుకు ఇది మెరుగైన పద్ధతి అని, ప్రస్తుతం హైఫీనియం ఆక్సైడ్‌ వాడకం సురక్షితమేనా? కాదా? అన్నదాన్ని రూఢి చేసుకునేందుకు తాము ప్రయత్నిస్తున్నామని శాస్త్రవేత్తలు చెపుతున్నారు.