శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 9 సెప్టెంబరు 2018 (13:32 IST)

అధిక రక్తపోటుకు దారితీసే ఆహార పదార్థాలేంటి?

హైటెక్ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ కారణంగా అనేక రకాలైన అనారోగ్యాలకు గురవుతున్నారు. ఇలాంటివాటిలో ఒకటి అధిక రక్తపోటు. హైబీపీ వల్ల గుండెపోటుకూ గురై చివరకు ప్రాణాలు కోల్ప

హైటెక్ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ కారణంగా అనేక రకాలైన అనారోగ్యాలకు గురవుతున్నారు. ఇలాంటివాటిలో ఒకటి అధిక రక్తపోటు. హైబీపీ వల్ల గుండెపోటుకూ గురై చివరకు ప్రాణాలు కోల్పోయే అవకాశం కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో అధిక రక్తపోటుకు కారణమయ్యే ఆహార పదార్థాలు ఏంటో ఓసారి పరిశీలిద్దాం.
 
* ప్యాకింగ్ చేసిన చిక్కుళ్లు, ఇతర కూరగాయలు. 
* టిన్నుల్లో అమ్మే ట్యూనా ఫిష్‌, నిల్వచేసిన ఉప్పు త‌దిత‌ర ఆహార పదార్థాలు. 
* కొవ్వు ఎక్కువ‌గా ఉండే ఆహార పదార్థాలు. 
* ప్రతి రోజూ మద్యం సేవించడం. 
* కాఫీ బాగా తాగే వారు త‌క్కువ‌గా తాగ‌డం లేదా దాన్ని పూర్తిగా మానేయ‌డం. 
* కొవ్వు తీయ‌ని పాల‌ు. వీటిని తాగడం వల్ల రక్తనాళాలు దృఢంగా మారుతాయి. ర‌క్త స‌ర‌ఫ‌రాకు ఆటంకం ఏర్ప‌డుతుంది.
* పాల‌తో త‌యారు చేసే చీజ్‌.
* చ‌క్కెర ఎక్కువ‌గా ఉండే ఆహార పదార్థాలు ఆరగించడం.
* ప్రాసెస్ చేయ‌బ‌డిన మాంసాన్ని ఆరగించడం.
* నిల్వ ఉంచే ఊర‌గాయ ప‌చ్చ‌ళ్ల‌ు.