మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By pnr
Last Updated : ఆదివారం, 2 సెప్టెంబరు 2018 (15:16 IST)

ముఖానికి మరింత అందాన్నిచ్చే కర్లింగ్ హెయిర్

చాలామందికి వెంట్రుకలు రింగులు రింగులుగా ఉంటాయి. ఈ కర్లింగ్ హెయిర్ ముఖానికి ఎంతో అందాన్ని ఇస్తాయి. ఎలాంటి ముఖ ఆకారం కలిగి ఉన్నవారికైనా ఈ శిరోజాలు నప్పుతాయి.

చాలామందికి వెంట్రుకలు రింగులు రింగులుగా ఉంటాయి. ఈ కర్లింగ్ హెయిర్ ముఖానికి ఎంతో అందాన్ని ఇస్తాయి. ఎలాంటి ముఖ ఆకారం కలిగి ఉన్నవారికైనా ఈ శిరోజాలు నప్పుతాయి. ఈ రకమైన జుట్టు కలిగి ఉన్నవారి ముఖంపై గల మడతలు కన్పించకుండా చేసి, ఏ వయస్సులో అయినా అందంగా కన్పించేలా సహకరిస్తాయి. అలాంటి ఉంగరాల జుట్టును కాపాడుకునేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. 
 
* తల స్నానం చేసిన తర్వాత సహజ గాలి ద్వారానే వెంట్రుకలు ఆరేలా చూసుకోవాలి. 
* చేతి వేళ్లను ఉపయోగించి శిరోజాలను సగం నుంచి ఒక అంగుళ భాగం వరకు తీసుకుంటూ వాటిని మెలి తిప్పుతూ మంచి ఆకృతి పొందేలా చేసుకోవాలి. 
* షాంపూతో స్నానం చేయని రోజులలో వెంట్రుకలను తిరిగి నీటితో తడిపి కండిషనర్ పెట్టుకోవాలి. 
 
* ఈ తరహా వెంట్రుకల సంరక్షణ చాలా అవసరం కూడా. 
* హైడ్రేటింగ్ షాంపు కండిషనర్లను మాత్రమే ఉపయోగించాలి. 
* శిరోజాలను ఆరబెట్టుకోవడానికి ఎయిర్ డ్రయర్ వంటివి ఉపయోగించరాదు.