మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. మనస్తత్వ శాస్త్రం
Written By pnr
Last Updated : ఆదివారం, 2 సెప్టెంబరు 2018 (12:11 IST)

తొలి కలయిక రోజున సహకరించాలా?... వద్దా?

భార్యాభర్తల దాంపత్య జీవితంలో శారీరక కలయిక అనేది జీవితంలో ఓ భాగం. ఇది పరీక్ష కాదు. తొలి ప్రయత్నంలో పాసైపోయి మెప్పు పొందడానికి! జీవన గమనంలో అదొక ఘట్టం మాత్రమే. కాబట్టి పూర్వానుభవం ఉంటే మేలనే చెప్పుడు మా

భార్యాభర్తల దాంపత్య జీవితంలో శారీరక కలయిక అనేది జీవితంలో ఓ భాగం. ఇది పరీక్ష కాదు. తొలి ప్రయత్నంలో పాసైపోయి మెప్పు పొందడానికి! జీవన గమనంలో అదొక ఘట్టం మాత్రమే. కాబట్టి పూర్వానుభవం ఉంటే మేలనే చెప్పుడు మాటలను పెడచెవిన పెట్టాలి.
 
అలాగే, తొలి రాత్రికి ముందు అమ్మాయి, అబ్బాయిల్లో ఉండే భయాలు, ఆందోళనలు, అపోహలను పక్కనబెట్టాలి. అపుడే తొలిరేయి కలయిక సాఫీగా జరిగిపోతోంది. శృంగార జీవితంలోని తొలి రోజు కలయికలో ఉన్న అనుభూతిని రూచిచూశాక ఇక వెనుదిరిగి చూసే ప్రసక్తే ఉత్పన్నకాదు. 
 
అయితే, తొలి కలయికలో భర్తకు సహకరించాలా? వద్దా? అనే సందేహం భార్యకు కలుగుతుంది. ఒకవేళ సహకరిస్తే పూర్వానుభవం ఉందనుకుంటారు. అందుకే తొలిసారి కలయికలో చిన్నపాటి చిట్కాలను పాటిస్తే సరిపోతుంది. 
 
అమ్మాయికే కాదు, అబ్బాయికీ అదే తొలి అనుభవం అనే విషయం గుర్తు పెట్టుకోవాలి. అలాంటప్పుడు అతని చర్యలకు స్పందించే విషయంలో అయోమయం చెందరాదు. అన్నిటికంటే ముందు కొత్త దంపతులు ఒకర్నొకరు అర్థం చేసుకోవాలి. ఇందుకోసం పెళ్లికి ముందు నుంచే అభిప్రాయాలు పంచుకోవాలి. 
 
ఒకవేళ మొదటి రాత్రి నాటికి ఇద్దరి మధ్య శారీరకంగా దగ్గరయ్యేంత చనువు ఏర్పడకపోతే ఒక వారం రోజుల సమయం తీసుకోవాలి. ఈ సమయాన్ని నెలల తరబడి కొనసాగించకూడదు. ఇలా మనసులు కలిసిన తర్వాత జరిగే తొలి కలయికలో ఎవరు ఎవర్నీ తప్పు పట్టే అవకాశం ఉండదని శృంగార నిపుణులు అభిప్రాయపడుతున్నారు.