గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 1 సెప్టెంబరు 2018 (14:40 IST)

ప్యాంటు విప్పి మహిళ కూర్చున్న సీటుపై మూత్రం పోశాడు...

తాగుబోతుల వీరంగాలు కేవలం భూమిమీదే కాదు.. ఆకాశంలో కూడా కొనసాగుతున్నాయి. అమెరికా నుంచి న్యూఢిల్లీకి వస్తున్న విమానంలో ఓ తాగుబోతు ప్రయాణికుడు ప్యాంటు విప్పి.. మహిళ కూర్చొన్న సీటుపై మూత్రం పోసి అవమానకరంగా

తాగుబోతుల వీరంగాలు కేవలం భూమిమీదే కాదు.. ఆకాశంలో కూడా కొనసాగుతున్నాయి. అమెరికా నుంచి న్యూఢిల్లీకి వస్తున్న విమానంలో ఓ తాగుబోతు ప్రయాణికుడు ప్యాంటు విప్పి.. మహిళ కూర్చొన్న సీటుపై మూత్రం పోసి అవమానకరంగా ప్రవర్తించాడు. దీంతో భయభ్రాంతులకు గురైన ఆ తల్లీకుమార్తెలు ట్విట్టర్ వేదికగా ఎయిరిండియాను నిలదీశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
శుక్రవారం న్యూయార్క్‌ నుంచి న్యూఢిల్లీకి ఎయిరిండియాకు చెందిన విమానమొకటి బయలుదేరింది. ఈ విమానంలో ఓ మహిళ తన కుమార్తెతో కలిసి ప్రయాణించింది. వారి సీటు పక్కనే మరో ప్రయాణికుడు కూర్చొన్నాడు. అపుడు పక్కనే మహిళ ఉన్నదనే జ్ఞానం కూడా లేకుండా ప్యాంటు విప్పి మహిళా సీటుపైనే మూత్రం పోశాడు. 
 
దీనిపై బాధితురాలి కుమార్తె ట్విట్టర్‌లో ట్వీట్ చేసింది. 'శుక్రవారం జేఎఫ్‌కే విమానాశ్రయం నుంచి బయల్దేరిన మీ విమానం ఏఐ102లో మా అమ్మకు దారుణ అనుభవంఎదురైంది. మద్యం సేవించిన ఓ ప్రయాణికుడు తన ప్యాంటు విప్పి ఆమె కూర్చున్న సీటుపై మూత్రం పోశాడు. ఒంటరిగా ప్రయాణిస్తున్న మా అమ్మ ఇది చూసి నిశ్చేష్టురాలైపోయింది. దీనిపై సాధ్యమైనంత త్వరగా సమాధానం చెబుతారని ఆశిస్తున్నాను...' అని ఫిర్యాదులో పేర్కొంది. 
 
ఈ ట్వీట్ వైరల్ కావడంతో కేంద్ర విమానయాన సహాయ మంత్రి జయంత్ సిన్హా దృష్టికి వెళ్ళింది. దీంతో వెంటనే విచారణ చేపట్టాలని ఆదేశించారు. 'దీనిపై సత్వరమే విచారణ చేపట్టి విమానయాన శాఖ, డీజీసీఏకి నివేదిక సమర్పించాలని ఆదేశించాం. ఇలాంటి భయంకరమైన పరిస్థితి మీ తల్లిగారికి ఎదురవడం చాలా దురదృష్టకరం..' అని సిన్హా పేర్కొన్నారు.