మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By pnr
Last Updated : మంగళవారం, 10 జులై 2018 (09:29 IST)

నాకది స్వర్గమే స్వామీజీ...

స్వామీజీ : తనకు దగ్గరగా వెళుతున్న ఓ తాగుబోతును ఆపి... "అలా తగకు నాయనా.. నీవు చనిపోయాగా నరకానికి పోతావ్" అని చెపుతాడు. తాగుబోతు : నా సంగతి సరే.. మరి నాకు మందు అమ్మేవాడు? స్వామీజీ : అతను కూడా నరకానిక

స్వామీజీ : తనకు దగ్గరగా వెళుతున్న ఓ తాగుబోతును ఆపి... "అలా తగకు నాయనా.. నీవు చనిపోయాగా నరకానికి పోతావ్" అని చెపుతాడు. 
 
తాగుబోతు : నా సంగతి సరే.. మరి నాకు మందు అమ్మేవాడు?
 
స్వామీజీ : అతను కూడా నరకానికే నాయనా.
 
తాగుబోతు : మరి మందుషాపు ముందు చికెన్, ఇతరాత్రా తినుబండరాలు అమ్మేవాడు?
 
స్వామీజీ : ఇందులో సందేహం ఎందుకు అతను కూడా నరకానికే పోతాడు నాయనా!
 
తాగుబోతు : అది చాలు స్వామీజీ... వాళ్లిద్దరూ కూడా ఉంటే అది నాకు స్వర్గమే.. ఇంకెక్కడ నరకం అంటూ తూలుతూ వెళ్ళిపోయాడు.