బాలీవుడ్ హీరోను చితక్కొట్టిన మందుబాబులు  
                                          సాధారణంగా వెండితెరపై మందుబాబులను, రౌడీలను హీరోలు చితక్కొడుతుంటారు. కానీ, నిజజీవితంలో ఈ సీన్ రివర్స్ అయింది. బాలీవుడ్‌లో ప్రముఖ హీరోను మందుబాబు కొట్టాడు.
                                       
                  
				  				  
				   
                  				  సాధారణంగా వెండితెరపై మందుబాబులను, రౌడీలను హీరోలు చితక్కొడుతుంటారు. కానీ, నిజజీవితంలో ఈ సీన్ రివర్స్ అయింది. బాలీవుడ్‌లో ప్రముఖ హీరోను మందుబాబు కొట్టాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
				  											
																													
									  
	 
	హీరో అర్జున్ కపూర్ 'సందీప్ ఔర్ పింకీ ఫరార్' చిత్రం షూటింగ్ కోసం ఉత్తరాఖండ్‌లోని పితోరాఘడ్ పట్టణానికి వచ్చాడు. పీకలదాకా మద్యం తాగి కారులో వచ్చిన డ్రైవరు కమల్ కుమార్ హీరో అర్జున్ కపూర్‌ను కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు షూటింగ్ జరుగుతున్న ప్రదేశానికి వచ్చాడు. 
				  
	 
	మద్యం తాగిన మత్తులో షేక్ హ్యాండ్ ఇస్తూ అర్జున్ కపూర్‌పై ఆకస్మికంగా దాడికి తెగబడ్డాడు. అంతే హీరో సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు వచ్చి తాగుబోతు అయిన కమల్ కుమార్‌ను అదుపులోకి చితక్కొట్టారు. 
				  																								
	 
 
 
  
	
	
																		
									  
	 
	హీరోపై చేయి చేసుకున్న మందు బాబు కమల్ కుమార్‌కు మోటారు వాహనాల చట్టం కింద మద్యం తాగి కారు నడిపాడని పోలీసులు కేసు పెట్టి అతనికి రూ.500 జరిమానా విధించారు. అనంతరం మద్యం తాగి కారు నడిపినందున అతని డ్రైవింగ్ లైసెన్సును రద్దు చేస్తామని రవాణాశాఖాధికారి చెప్పారు.