ఆ కాలేజీల్లో ఫ్రీకోర్స్... అమ్మాయిలను ఎక్కడెక్కడో తాకుతూ ఆపై...
దిగువ మధ్యతరగతి, పేద కుటుంబాల ఆడ పిల్లలే వారికి టార్గెట్. చదువుకునేందుకు ఆర్థిక స్తోమత లేక చితికిపోయినవారే వారికి ఎసెట్. ఆయా పాఠశాలలకు వచ్చి ఉచిత కోర్స్ ఇస్తామని చెప్పి బాలికల ఫోన్ నెంబర్లు, చిరునామాలు తీసుకువెళతారు. నిజంగానే ఉచితంగా డిప్లొమో వస్తుంద
దిగువ మధ్యతరగతి, పేద కుటుంబాల ఆడ పిల్లలే వారికి టార్గెట్. చదువుకునేందుకు ఆర్థిక స్తోమత లేక చితికిపోయినవారే వారికి ఎసెట్. ఆయా పాఠశాలలకు వచ్చి ఉచిత కోర్స్ ఇస్తామని చెప్పి బాలికల ఫోన్ నెంబర్లు, చిరునామాలు తీసుకువెళతారు. నిజంగానే ఉచితంగా డిప్లొమో వస్తుందని నమ్మి పేద బాలికలు వెళ్లారో ఇక అంతేసంగతులు. అక్కడ వారికి నరకం కనబడుతుంది.
తమిళనాడులో తాజాగా వెలుగుచూసిన ఓ ఘటనతో ఒక్కసారిగా ఆ రాష్ట్రంలోని జనం ఉలిక్కిపడ్డారు. వివరాల్లోకి వెళితే... విల్లుపురంలో నివాసముంటున్న 22 ఏళ్ల యువతి తన తండ్రి మరణంతో ఆర్థికంగా దెబ్బతిని మధ్యలోనే చదువు ఆపేసింది. కానీ లోలోపల ఎలాగైనా కోర్సు ముగిస్తే తన కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోగలననే ఆశయంతో చూస్తుండేది. ఇంతలో ఆమెకు ఓ పేపరులో ప్రకటన కనబడింది. అందులో ఫ్రీకోర్స్ ఇస్తామనీ, కోర్స్ పూర్తి చేసినట్లు సర్టిఫికేట్ ఇస్తామని వుంది.
దీనితో ఎంతో ఆశతో ఆమె తన తల్లిని ఒప్పించి విల్లుపురంలో వున్న ఫ్రీకోర్స్ కాలేజిలో చేరింది. ఐతే ఆమె కాలేజీలోని క్లాసులకు వెళ్లగానే పరిస్థితిలో ఏదో తేడాగా వున్నట్లనిపించింది. కలైమణి అని పిలువబడే కాలేజీ కరస్పాండెంట్ తాము వున్న తరగతి గదికి మద్యం సేవించి వచ్చాడు. అక్కడికి అలా రావడమే కాకుండా తమ ముందు కూర్చుని విద్యార్థునుల్లో ఓ విద్యార్థిని ఎంపిక చేసి ఆమెను తన ప్రక్కనే కూర్చోమనేవాడు.
అంతా చూస్తుండగానే.. తను మీలాంటి పేద బాలికలకు ఫ్రీ కోర్స్ ఇప్పిస్తున్నందుకు తనకు ముద్దు పెట్టాలని అడిగేవాడు. ఇంకా ఇలాంటి వెకిలి చేష్టలు ఎన్నో చేసేవాడు. దుస్తులు ఇలాగేనా వేసుకునేది అంటూ ఎక్కడెక్కడో తాకేసేవాడు. అతడి అసభ్య ప్రవర్తనకు ఎదురు చెబితే అంతే... బూతులు తిట్టడమే కాకుండా టార్చర్ మొదలుపెట్టేవాడు. కోర్స్ సర్టిఫికేట్ ఇవ్వనని బెదిరించేవాడు. అతడి ఆగడాలను ఎవరికైనా చెప్పుకుందామంటే ఎవ్వరూ మద్దతు తెలిపేవారు కాదు.
తరగతి గదిలో ఏ విద్యార్థిని అయితే ఎదిరిస్తుందో ఆమెపై కలైమణి టార్గెట్ పెట్టేవాడు. అతడి భార్యను పురమాయించేవాడు. ఆమె సదరు విద్యార్థునులపై చేయిచేసుకునేది. అతడి ఆగడాలు అంతటితో ఆగేవి కాదు. లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. ఇంకా ఇంటర్న్‌షిప్ పేరుతో విద్యార్థునులను ఆయా కంపెనీలకు పంపేవాడు. అలా కంపెనీలకు వెళ్లే విద్యార్థునులపై లైంగిక దాడులు కూడా జరిగాయని సదరు విద్యార్థిని ఫిర్యాదు చేసింది.
తన తండ్రి మరణించిన కారణంగా ఆర్థిక సమస్యలు తలెత్తి ఉచిత కోర్సుతో నిలదొక్కుకుందామని ఆ కళాశాలకు వస్తే ఇక్కడ పరిస్థితి ఇంత దారుణంగా వున్నదని ఆమె వాపోయింది. కాలేజీలో ఇతర విద్యార్థునులు ఆ బాధలన్నిటినీ భరిస్తుండగా ఎనిమిది మంది విద్యార్థునులు మాత్రం విషయాన్ని జిల్లా కలెక్టరు దృష్టికి తీసుకెళ్లారు. దీనితో సదరు కళాశాలను వెంటనే సీజ్ చేశారు. కానీ కరస్పాండెంట్ కలైమణి పరారయ్యాడు. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఫ్రీకోర్స్ పేరుతో వచ్చే ఎలాంటి ప్రకటనల పైనైనా తస్మాత్ జాగ్రత్త అంటున్నారు పోలీసులు.