గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 29 జులై 2017 (09:49 IST)

బ్యూటీక్వీన్‌కు వోడ్కా తాగించి... అపార్టుమెంటుకు తీసుకువెళ్లి...

ఆస్ట్రేలియాలో ఓ బ్యూటీ క్వీన్‌ అత్యాచారానికి గురైంది. ఈమె పేరు అలే శాన్‌ఫోర్డ్. 2016 మిస్ ఆస్ట్రేలియా పోటీల విజేత. తనపై అత్యాచారం జరిగినట్టు ఆమె తాజాగా సంచలన ప్రకటన చేసింది.

ఆస్ట్రేలియాలో ఓ బ్యూటీ క్వీన్‌ అత్యాచారానికి గురైంది. ఈమె పేరు అలే శాన్‌ఫోర్డ్. 2016 మిస్ ఆస్ట్రేలియా పోటీల విజేత. తనపై అత్యాచారం జరిగినట్టు ఆమె తాజాగా సంచలన ప్రకటన చేసింది. 
 
తాను పెర్త్ బార్‌కు వెళ్లినపుడు ఓ ఆగంతకుడు తనకు ఆరంజ్ జ్యూస్‌తోపాటు వోడ్కా తాగించి అపార్టుమెంటు బ్లాకులోకి తీసుకువెళ్లి రెండుసార్లు అత్యాచారం చేశాడని ఆరోపించింది. తనపై జరిగిన అత్యాచారం గురించి తల్లిదండ్రులకు చెప్పేందుకు ఐదేళ్లు పట్టిందని తెలిపింది. 
 
అత్యాచార బాధితులకు తాను అండగా నిలుస్తానని చెప్పిన ఈ సుందరి తనకు జరిగిన భయంకరమైన లైంగిక దాడి గురించి వారితో పంచుకుంది. అత్యాచార బాధితులను సమాజం సానుభూతితో చూడాలని కోరింది. తాను కౌన్సెలరుతోపాటు స్నేహితులతో గడపడం ద్వారా భయంకరమైన ఆ ఘటన గురించి మర్చిపోయి తిరిగి సాధారణ పౌరురాలిగా జీవిస్తున్నట్టు చెప్పుకొచ్చింది.