సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 12 జులై 2017 (10:00 IST)

తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందే : నటి రమ్య నంబీశన్ వ్యాఖ్యలు

లైంగికదాడికి గురైన మలయాళ నటి భావనకు అండగా నిలిచేవారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఈ దాడి కేసులో మలయాళ సినీ స్టార్ దిలీప్‌ను కేరళ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెల్సిందే. దీంతో భావనపై జరిగిన లైంగిక దాడిప

లైంగికదాడికి గురైన మలయాళ నటి భావనకు అండగా నిలిచేవారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఈ దాడి కేసులో మలయాళ సినీ స్టార్ దిలీప్‌ను కేరళ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెల్సిందే. దీంతో భావనపై జరిగిన లైంగిక దాడిపై మాట్లాడేందుకు ఇన్నాళ్లూ సంకోచించిన పలువురు నటీనటులు ఇప్పుడు ముందుకు వచ్చి నోరువిప్పుతున్నారు. 
 
తాజాగా మరో హీరోయిన్ రమ్య నంబీశన్ భావనకు మద్దతు పలికింది. దీనిపై ఆమె స్పందిస్తూ... 'అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన భావనకు దక్కిన విజయమిది. నిజం ఎప్పటికైనా బయటపడుతుందనే నమ్మకంతోనే ఇంతకాలం పాటు వేచి చూశాం. ఎట్టకేలకు నిజం నిగ్గుతేలింది. హ్యాట్సాప్‌.. కేరళ పోలీసులు.. మేం ఎప్పుడూ భావనకు మద్దతుగా ఉంటాం' అంటూ పేర్కొంది. 
 
మరోవైపు.. ప్రముఖ డైరెక్టర్ విజయన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నటి భావనపై జరిగిన లైంగిక దాడికి కారణం మలయాళ స్టార్ హీరో దిలీప్ అన్న సంగతి అందరికీ తెలుసని ఆరోపించారు. మలయాళ చిత్ర పరిశ్రమలోని ప్రముఖులను దిలీప్ తన గుప్పిట్లో పెట్టుకున్నాడని అన్నారు.  
 
అందుకే భావనపై జరిగిన లైంగిక దాడి వెనుక దిలీప్ ఉన్నాడని సినీ పరిశ్రమ మొత్తానికి తెలిసినా, అతనికి వ్యతిరేకంగా ఒక్కరు కూడా మాట్లాడలేదని ఆయన తెలిపారు. అయితే బాధిత నటికి అండగా నిలిచేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం సిగ్గుచేటని ఆయన పేర్కొన్నారు.