సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By pnr
Last Updated : శనివారం, 8 సెప్టెంబరు 2018 (15:14 IST)

కాలేయ పనితీరును మెరుగుపరిచే చెరకు రసం

చిన్నవయసులో చెరుకుగడలను పిల్లలు సంబరాలు, తిరునాళ్లప్పుడు నములుతూ, తింటూ ఆస్వాదిస్తూ ఉండేవారు. ఒక వయసు దాటాక పెద్దలు కూడా చెరుకుగడలనుకాకుండా చెరుకురసాన్ని తాగడం వంటివి చేసేవారు. అలాంటి చెరుకు రసంతో అనే

చిన్నవయసులో చెరుకుగడలను పిల్లలు సంబరాలు, తిరునాళ్లప్పుడు నములుతూ, తింటూ ఆస్వాదిస్తూ ఉండేవారు. ఒక వయసు దాటాక పెద్దలు కూడా చెరుకుగడలనుకాకుండా చెరుకురసాన్ని తాగడం వంటివి చేసేవారు. అలాంటి చెరుకు రసంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అలాంటి వాటిలో కొన్నింటిని పరిశీలిస్తే...
 
* చెరుకు మూత్రపిండాలకు చాలా మేలు చేస్తుంది. వాటిని ఆరోగ్యంగా ఉంచుతుంది.
* చెరుకు రసం పిల్లల్లో జ్వరాలను నివారిస్తుంది. జ్వరాన్ని వెంటనే తగ్గిస్తుంది కూడా. 
* చెరుకు రసం ఎన్నో రకాల కేన్సర్లను నివారిస్తుంది. 
* గర్భ రక్షణ కోసం గర్భవతులు పరిశుభ్రమైన, తాజా చెరుకురసాన్ని తాగడం చాలా మంచిది. 
* చెరుకు తాగడం వల్ల కాలేయం పనితీరును మెరుగుపరుస్తుంది. 
* కామెర్ల వ్యాధికి చెరుకు రసంతో చెక్ పెట్టొచ్చు. 
* చెరుకు రసంలోని పోషకాలు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి.