మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: సోమవారం, 17 సెప్టెంబరు 2018 (15:27 IST)

మరీ సన్నగా ఉన్నవారు హ్యాండ్‌సమ్‌గా కనిపించాలంటే...

మగవారు కానీ, ఆడవారు కానీ, పిల్లలు కానీ వారివారి ఎత్తుకు, వయసుకు తగిన బరువు కలిగి ఉండటమే అందం, ఆరోగ్యము కూడా. అలాకాక ఎత్తుకు తగినంత బరువు కంటే మరీ తక్కువ ఉండటం అంద వికారానికి, అనారోగ్యానికి దారి తీస్తుంది. దీనికి మనం ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే

మగవారు కానీ, ఆడవారు కానీ, పిల్లలు కానీ వారివారి ఎత్తుకు, వయసుకు తగిన బరువు కలిగి ఉండటమే అందం, ఆరోగ్యము కూడా. అలాకాక ఎత్తుకు తగినంత బరువు కంటే మరీ తక్కువ ఉండటం అంద వికారానికి, అనారోగ్యానికి దారి తీస్తుంది. దీనికి మనం ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే సరిపోతుంది. అవేంటో చూద్దాం.
 
1. శరీర బరువుకు అవసరమయ్యే పప్పులు, గ్రుడ్డులు, చేపలు, మాంసం వారానికి నాలుగు లేక అయిదుసార్లు వాడాలి. 
 
2. శాఖాహారులు అన్ని రకాల పప్పు దినుసులు తీసుకోవాలి. ప్రతి రోజు డ్రైప్రూట్స్ తీసుకోవాలి. తినే ఆహారం మోతాదు పెంచాలి.
 
3. ఒకేసారి ఎక్కువ ఆహారం తీసుకోవడం అంత మంచిది కాదు. కనుక కొంచెం కొంచెం ఆహారం మోతాదును పెంచడం మంచిది. 
 
4. మూడుపూట్ల భోజనం చేస్తూ మధ్యలో చిరుతిండ్లు తినడం మంచిది. అంతేకాకుండా కాయగూరలు, పండ్లు కూడా సమృద్ధిగా తీసుకోవాలి. దుంపకూరలు అంటే... చేమ, కంద, బంగాళదుంపలు మొదలైనవి ఎక్కువగా తినాలి.
 
5. పడుకునే ముందు ఒక గ్లాసు పాలు తీసుకోవడం మంచిది.