గురువారం, 9 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By ivr
Last Modified: శనివారం, 15 సెప్టెంబరు 2018 (14:02 IST)

వగరు రుచి ఆరోగ్య రహస్యాలు... ఎక్కువగా తీసుకుంటే పురుషుల పని అంతే...

వగరుతో వుండే పదార్థాలను తినడం కష్టమైనా ఆరోగ్యకరమైనది. గొంతు, నాలుకపై వెంటనే దీని ప్రభావం ఉంటుంది. వగరుతో వుండే పదార్థాలు శరీరంపై చూపించే ప్రభావం ఎలా వుంటుందంటే... పిత్త, కఫ దోషాలను ఉపశమింప జేస్తుంది. రక్తాన్ని శుభ్రపరుస్తుంది.

జీర్ణం చేసుకునేందుకు బరువుగా ఉంటుంది. శరీరంలోని అధికంగా ఉన్న నీటిని పీల్చుతుంది. జిడ్డు చర్మం కలవారికి మంచిది. శరీరానికి చలవ చేస్తుంది. కురుపులు, వ్రణాల నుండి చెడు పదార్థాలను పారద్రోలుతుంది. క్రొవ్వు నిల్వలు తగ్గిస్తుంది.
  
అధికంగా తీసుకుంటే... పొట్ట ఉబ్బరింపు, బరువు, దాహం, శృంగార వాంఛ తగ్గుతుంది. మలబద్దకం, రక్త నాళాలలోని అడ్డంకులు ఏర్పడటం జరుగుతుంది.