మహిళలూ.. ఫ్రెంచ్ ఫ్రైస్‌ని ఇష్టపడి తింటున్నారా?

ఫ్రెంచ్ ఫ్రైస్‌ని ఇష్టపడి తింటున్నారా? అయితే మహిళల్లో లైంగిక సామర్థ్యం తగ్గిపోతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సంతానోత్పత్తి కలగకుండా ఉండే అవకాసం ఎక్కువగా ఉందంటుని వైద్యులు చెప్తున్నారు. సాయంత్రం వేఫ్రెంచ్ ఫ్రైస్‌ని ఇష్టపడి తింటున్నారా? అయితే మహిళల

selvi| Last Updated: శనివారం, 15 సెప్టెంబరు 2018 (12:05 IST)
ఫ్రెంచ్ ఫ్రైస్‌ని ఇష్టపడి తింటున్నారా? అయితే మహిళల్లో లైంగిక సామర్థ్యం తగ్గిపోతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సంతానోత్పత్తికి ఫ్రెంచ్ ఫ్రైస్ అడ్డుకుంటాయని వైద్యులు చెప్తున్నారు. సాయంత్రం వేళల్లో మహిళలు ఫ్రెంచ్ ఫ్రైస్‌ని స్నాక్స్‌గా తీసుకుంటే మహిళల్లో లైంగిక సామర్థ్యం తగ్గిపోతుందట. కేవలం ఫ్రెంచ్ ఫ్రైస్ మాత్రమే కాకుండా కొన్ని రకాల జంక్ ఫుడ్స్ తినడం వల్ల కూడా ఈ సమస్య తలెత్తే అవకాశం ఉందంటున్నారు.. వైద్యులు. 
 
మహిళలు బర్గర్స్, ఫ్రైడ్ చికెన్, పిజ్జా, చిప్స్ వంటి ఫాస్ట్ ఫుడ్స్‌ను తీసుకుంటూ పండ్లను తక్కువగా తీసుకోవడం ద్వారా గర్భం దాల్చే అవకాశాలు తక్కువవుతాయని తాజా అధ్యయనంలో తేలింది. అందుకే సంతానం కావాలనుకునే మహిళలు జంక్ ఫుడ్స్.. ముఖ్యంగా ఫ్రెంచ్ ఫ్రైస్‌కి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. 
 
మరీ అంతగా ఫ్రెంచ్ ఫ్రైస్ తినాలని అనిపిస్తే.. బేక్డ్ చిప్స్, బనానా, ఆపిల్స్ లేదా ఏవైనా పండ్లను ఆల్మండ్ బటర్‌తో కలిపి తీసుకోవచ్చునని వైద్యులు చెప్తున్నారు. జంక్ ఫుడ్స్ తీసుకుంటే తప్పకుండా పండ్లను కూడా తీసుకోవడం ద్వారా ఫాస్ట్‌ఫుడ్ ఆరోగ్యంపై చూపే ప్రభావం తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు.దీనిపై మరింత చదవండి :