1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
  4. milk with jaggery, health benefits

పాలలో బెల్లం వేసుకుని తాగితే...?

ఈ బిజీ యుగంలో కాలంతో పోటీ పడుతూ మహిళలు, పురుషులు ఆరోగ్యానికి సరైన పోషక ఆహారం తీసుకోవడంలేదు. ఉదయం వేళ తీసుకునే పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పాలు అతి తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం మాత్రమే కాకుండా మంచి ఆరోగ్యాన్ని, ఆయుర్దాయాన్ని కూడా పెంచుతుంది. మహి

milk with jaggery
ఈ బిజీ యుగంలో కాలంతో పోటీ పడుతూ మహిళలు, పురుషులు ఆరోగ్యానికి సరైన పోషక ఆహారం తీసుకోవడంలేదు. ఉదయం వేళ తీసుకునే పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పాలు అతి తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం మాత్రమే కాకుండా మంచి ఆరోగ్యాన్ని, ఆయుర్దాయాన్ని కూడా పెంచుతుంది. మహిళలకు వయస్సు మీరే కొద్ది కాల్షియం తగ్గి ఎముకలు విరగడం, ఎముకలకు సంబంధించి వ్యాధులు సోకడం వంటివి జరుగుతున్నాయి.
 
కనుకనే మహిళలు చిన్న వయస్సు నుంచే పాలను తీసుకోవడం ఎంతైన అవసరమని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. పాలలో 87 శాతం నీరు, 4 శాతం క్రొవు పదార్ధాలు, 4.9 శాతం కార్బోహైడ్రేట్లు, 3.35 శాతం ప్రోటీన్లు, 0.75 శాతం ఖనిజ లవణాలు లభిస్తాయి. పాలలో లాక్టోసు అనే విశిష్టమైన చక్కెర పూర్తిగా కరిగిపోయి ఉంటుంది. అంతేకాక ఇందులో ఎ, బి, సి, మరియు డి విటమిన్లు కూడా లభిస్తాయని వారు అంటున్నారు.
 
చిన్న వయస్సు అంటే 7-10 వయస్సు గల అమ్మాయిలు రోజుకు సుమారు 3-4 గ్లాసుల పాలు, పెరిగే వయస్సులో నాలుగు గ్లాసుల కంటే ఎక్కువ పాలు, పాతికేళ్ళ వయస్సులో 2 గ్లాసుల పాలు రోజూ తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. పాలలో బెల్లం కలిపి తీసుకుంటే ఐరన్ కూడా లభిస్తుంది. కాబట్టి ఎముకల పుష్టికి పాలు ఎంతగానో దోహదపడతాయి.
About Writer
chj
తర్వాతి కథనం
గాఢనిద్రలోంచి మెలకువ వచ్చినా లేవలేరు.. కదల్లేరు.. గువ్వతొక్కిందా.. దయ్యం నొక్కుతోందా? ఏది నిజం?