1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
  4. ponnaganti leafy curry

పౌష్టికరమైన ఆరోగ్యాన్నిచ్చే పొన్నగంటి ఆకు

రక్తాన్ని శుద్ధి చేయడానికి పొన్నగంటి కూర ఎంతగానో ఉపకరిస్తుంది. అంతేగాదు దీనివల్ల బరువు తగ్గడం, పెరగడం, శరీర సౌష్ఠవం పెరగడం వంటి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్ 'ఎ', 'బి6', 'సి', ఫొలేట్, 'రైబోఫ్లెవిన్', పొటాషియం, ఇనుము, మెగ్నీషియ

ponnaganti leafy curry
రక్తాన్ని శుద్ధి చేయడానికి పొన్నగంటి కూర ఎంతగానో ఉపకరిస్తుంది. అంతేగాదు దీనివల్ల బరువు తగ్గడం, పెరగడం, శరీర సౌష్ఠవం పెరగడం వంటి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్ 'ఎ', 'బి6', 'సి', ఫొలేట్, 'రైబోఫ్లెవిన్', పొటాషియం, ఇనుము, మెగ్నీషియం ఈ ఆకులో సమృద్ధిగా దొరకుతాయి. శుభ్రం చేసిన పొన్నగంటి ఆకును ముక్కలుగా చేసి, పెసరపప్పు, జీలకర్ర, చిన్న ఉల్లిపాయలు, వెల్లుల్లి, మిరియాల పొడి చేర్చి ఉడికించి తీసుకుంటే శరీరంలో రక్తం శుద్ధి అవుతుంది. 
 
పొన్నగంటి కూరను ఉడికించి ఉప్పు, మిరియాల పొడి చేర్చి తీసుకుంటే బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అట్లే కందిపప్పు, నెయ్యితో పొన్నగంటి కూరను తీసుకుంటే బరువు పెరుగుతారు. ఆ కూరను ఆహారంగా తీసుకోవడం ద్వారా శరీర ఛాయ మెరుగుపడుతుంది. పొన్నగంటి ఆకును తాళింపు వేసుకొని ఆహారంగా తీసుకుంటే కంటి క్రింద నల్లని వలయాలు, కంటి సమస్యలు దూరమవుతాయి. 
 
ఈ ఆకు నోటి దుర్వాసనను పోగొడుతుంది. గుండెకు, మెదడుకు ఉత్సాహాన్నిస్తుంది. ఆస్తమా, బ్రాంకైటీస్‌తో బాధపడేవారు పొన్నగంటి రసంలో తేనె కలిపి తీసుకుంటే మంచిది. దీనిలో లభించే క్యాల్షియం ఎముకల ఎదుగుదలకూ, ఆస్టియోపోరోసిస్ వంటి వాటిని దూరం చేయడానికీ ఉపయోగపడుతుంది. ఈ ఆకుల్లోని కొన్ని పోషకాలు శరీరంలోని క్యాన్సర్ కారకాలతో పోరాడతాయి. గౌట్, మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారు వైద్యుల సలహాతోనే దీన్ని తీసుకోవాలి.
About Writer
chj
తర్వాతి కథనం
మెరుగైన ఫ‌లితం కోసం....ఆల్మండ్ ఆయిల్, రోజ్ వాటర్ !!