పెళ్లి చేసుకుంటానని మైనర్ బాలికపై అత్యాచారం.. ఎక్కడ?
మహిళలపై అకృత్యాలు వయోబేధం లేకుండా జరుగుతున్నాయి. తాజాగా ప్రేమ పేరుతో ఓ మైనర్ మోసపోయింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ వ్యక్తి మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. మానకొండూరు మండలం జగ్గయ్యపల్లికి చెందిన ఆటో డ్రైవర్ గనుకుంట్ల మురళీ కృష్ణ, కాలేజీకి వెళ్తున్న మైనర్ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో ఆ మైనర్ బాలిక అతనిని నమ్మింది. ఆపై పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు.
జూన్ 29న టీసీ కోసం వెళ్తున్న బాలికను బలవంతంగా తీసుకెళ్లి పెద్దపల్లి జిల్లా నిరుకుల్లా గ్రామంలోని ఆలయం వద్ద అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
