1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
  4. SRIVARI SEVAKULU IS SELFLESS SERVICE

శ్రీవారి సేవ నిస్వార్థమైనది: ఈవో సాంబశివ రావు

TTD
తిరుమల తిరుపతి దేవస్థానం ఆద్వర్యంలో నడుస్తున్న శ్రీవారి సేవ కార్యక్రమంలో పాల్గొంటున్న వారందరూ నిస్వార్థ సేవకులని ఆ సంస్థ కార్యనిర్వహణాధికారి డి సాంబశివరావు అన్నారు. 2000వ సంవత్సరంలో కేవలం 195 మందితో ఆరంభమైన ఈ సేవకుల సంఖ్య దాదాపు 5.5 లక్షల మందికి చేరకుందని చెప్పారు.
 
 శ్రీవారి సేవకుల కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వారిలో దాదాపు 3.5 లక్షల మంది మహిళలు కావడం విశేషమన్నారు. దాదాపుగా 13 రాష్ట్రాల నుంచి శ్రీవారి సేవకులు తిరుమలలో సేవలు అందించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంబంధాల అధికారి తలారి రవి, ఏపిఆర్వో నీలిమ తదితరులు పాల్గొన్నారు. 
About Writer
PY REDDY