శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By
Last Updated : ఆదివారం, 23 డిశెంబరు 2018 (14:01 IST)

అసిడిటీని తగ్గించే అద్భుతమైన చిట్కాలు

చాలా మందికి తిన్న ఆహారం జీర్ణంకాదు. కడుపు ఉబ్బరంగా ఉంటుంది. ఛాతిలో నొప్పి కలిగినట్టుగా ఉంటుంది. నోటి నుంచి దుర్వాసన, పొడి దగ్గు, ఆయాసం తదితర లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇలాంటివన్నీ అసిడిటీ లక్షణాలు. అయితే అసిడిటీని తగ్గించుకునేందుకు మన ఇంట్లో ఉన్న సహజ సిద్ధమైన పదార్థాలు చాలు. వాటితో అసిడిటీని ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 
 
* ప్రతి రోజూ ఉదయాన్నే పరగడుపునే నాలుగైదు పుదీనా ఆకులను నమిలి మింగాలి. పుదీనాలో ఉండే ఔషధ గుణాలు అసిడిటీని తగ్గిస్తాయి. 
* భోజనం తర్వాత పుదీనా ఆకుల రసాన్ని నీటిలో కలుపుకుని తాగినా.. అసిడిటీ నుంచి బయట పడవచ్చు. 
* తులసి ఆకులను నిత్యం మూడు పూటలా భోజనానికి ముందు నమలుతుంటే అసిడిటీ రాకుండా చూసుకోవచ్చు. అలాగే తిన్న ఆహారం కూడా జీర్ణమైపోతుంది. 
* భోజనం చేసిన తర్వాత 20 నిమిషాలు ఆగి కొబ్బరినీళ్లు తాగాలి. దీని వల్ల అసిడిటీ తగ్గుతుంది. 
* భోజనానికి ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీస్పూన్ నిమ్మరసం కలిపి తాగితే అసిడిటీ రాదు.