మెంతి పొడిని పాలలో కలిపి సేవిస్తే..?
మెంతులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మెంతుల్లో ఫైబర్, ప్రోటీన్స్, ఐరన్, మాంగనీస్, మెగ్నిషియం వంటి ఖనిజాలు అధికంగా ఉన్నాయి. మెంతులు ఎక్కువగా తీసుకుంటే అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. అధిక బరువు తగ్గాలనుకునేవారు తరచు మెంతులను వంటకాల్లో చేర్చుకుంటే బరువు త్వరగా తగ్గుతారు. జీర్ణసంబంధిత సమస్య కూడా పోతుంది.
1. మెంతుల్లోని యాంటీ ఆక్సిడెంట్స్ కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, అజీర్తి నుండి విముక్తి కలిగేలా చేస్తాయి. కడుపునొప్పిగా ఉన్నప్పుడు కొన్ని మెంతులను నీటిలో నానబెట్టి తీసుకుంటే నొప్పి తగ్గుతుంది.
2. మెంతులను నూనెలో వేయించుకుని వాటిని మెత్తని పొడిలా చేసుకోవాలి. ఈ చేసిన పొడిని గ్లాస్ పాలలో వేసి స్పూన్ చక్కెర కలిపి తాగితే నీరసం, ఒత్తిడి వంటి సమస్యలుండవు.
3. కొందరైతే చలికాలం కారణంగా ముఖం తాజాదనాన్ని కోల్పోతారు. ఈ సమస్యను తొలగించుకోవడానికి ఎలాంటి క్రీములు వాడినా ఫలితాలు కనిపించలేదు. అందుకు ఏం చేయాలంటే.. మెంతుల పొడిలో కొద్దిగా నీరు కలిపి ముఖానికి రాసుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది.
4. మెంతులు ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తాయి. డయాబెటిస్ వ్యాధికి మెంతులు దివ్యౌషధంగా పనిచేస్తాయి. శరీరంలోని చెడు వ్యర్థాలను తొలగిస్తాయి. నీళ్ల విరేచనాలవుతుంటే.. కొన్ని మెంతి గింజలను తీసుకోవాలి. ఇలా చేస్తే.. తక్షణమే సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది.
5. మెంతులు శరీరంలోని కార్బొహైడ్రేట్స్ నిల్వలను అదుపులో ఉంచుతాయి. దాంతో పాటు కాలేయంలో కొలెస్ట్రాల్ ఉత్తత్పని ప్రేరేపిస్తాయి. శరీరంలోని షుగర్ లెవల్స్‌ను కంట్రోల్లో ఉంచుతాయి.
6. గుండె సంబంధిత వ్యాధుల నుండి కాపాడుతాయి. రక్తప్రసరణకు చాలా మంచివి. పురుషుల్లో లైంగిక సామర్థ్యాన్ని పెంచుతాయి. స్త్రీల కంటే పురుషులు మెంతులు అధిక మోతాదాలో తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతుంది.